వరంగల్: తెలంగాణలో పెద్ద పండుగ దసరాకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట మీదుగా పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 25 వరకు సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ - హైదరాబాద్‌ల మధ్య మొత్తం 34 స్పెషల్ రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. పండుగ వేళ ఇంటికి వెళ్లాలనుకునే వారికి రైలు ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది.

సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్ (0711) ప్రత్యేక రైలు మధ్యాహ్నం 12:10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మధ్యాహ్నం 2:10 గంటలకు కాజీపేటకు, ఆపై సాయంత్రం 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రైలు సాయంత్రం 6 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయలుదేరి, రాత్రి 8 గంటలకు కాజీపేటకు, రాత్రి 11:15 గంటలకు హైదరాబాద్‌ సిటీకి చేరుకుంటుంది. ఈ రైలుకు చర్లపల్లి, భువనగిరి, యాదాద్రి, జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు.

మరోవైపు పండుగ సమయంలో ప్రయాణికుల కోసం హైదరాబాద్‌ - హజ్రత్ నిజాముద్దీన్ (న్యూఢిల్లీ), చర్లపల్లి - హజ్రత్ నిజాముద్దీన్ మధ్య వన్-వే ఫెస్టివల్ స్పెషల్ రైళ్లను ప్రకటించారు. హైదరాబాద్‌ - హజ్రత్ నిజాముద్దీన్ (07031) స్పెషల్ రైలు రాత్రి 11:25 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, తెల్లవారుజామున 1:30 గంటలకు కాజీపేటకు చేరుతుంది. అక్టోబరు 11న చర్లపల్లి - హజ్రత్ నిజాముద్దీన్ (07035) స్పెషల్ రైలు రాత్రి 11:55 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, తెల్లవారుజామున 2 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. ఈ ఉత్తరాది ప్రత్యేక రైళ్లు అన్నింటికీ కాజీపేట, బల్లార్షా, నాగపూర్, ఇటార్సి, జబల్‌పూర్, కట్నీ, సత్నా, చిత్రకూట్ ధామ్ కర్వీ, బాందా, వీజీఎల్ ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు

సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్ (34 రైలు సర్వీసులు)

అక్టోబర్ 25 వరకు ఈ మార్గంలో మొత్తం 34 ప్రత్యేక రైళ్లు సేవలు అందిస్తాయి

రైలు నం. 0711 (సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్): సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12:10 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 2:10 గంటలకు కాజీపేట, సాయంత్రం 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్

తిరుగు ప్రయాణం: సిర్పూర్ కాగజ్‌నగర్‌లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి, రాత్రి 8 గంటలకు కాజీపేట, రాత్రి 11:15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

హాల్టింగ్‌ స్టేషన్లు: చర్లపల్లి, భువనగిరి, యాదాద్రి, జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్.

వన్ వే ఫెస్టివల్ స్పెషల్ రైళ్లు (ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్‌కు)

రైలు నం. 07031 (హైదరాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్): ఈ నెల 9న రాత్రి 11:25 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, తెల్లవారుజామున 1:30 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది.

రైలు నం. 07035 (చర్లపల్లి - హజ్రత్ నిజాముద్దీన్): అక్టోబర్ 11న రాత్రి 11:55 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, తెల్లవారుజామున 2:00 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది.

హాల్టింగ్‌ స్టేషన్లు: కాజీపేట, బల్లార్షా, నాగపూర్, ఇటార్సి, జబల్‌పూర్, కట్నీ, సత్నా, చిత్రకూట్ ధామ్ కర్వీ, బాందా, వీజీఎల్ ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా.