Work Life Productivity Tips : నేటి వేగవంతమైన జీవితంలో ప్రొడెక్టివిటీ అనేది విజయానికి ప్రధాన మంత్రంగా మారింది. అందుకే తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొందరు తెలియకుండానే కొన్ని రోజువారీ అలవాట్ల వల్ల తమ ప్రొడెక్టివిటీని తగ్గించుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. బయటకు హానికరంగా కాకుండా.. మానసిక శక్తిని తగ్గించి పనితీరును దెబ్బతీసే అలవాట్లు ఏంటో చూసేద్దాం.

ఫోన్‌ వినియోగం..

ఫోన్‌ను తరచూ చెక్ చేయడం అనేది పెద్ద సమస్యగా మారుతోంది. ఏదొక నోటిఫికేషన్ రావడం.. దానిని చూసేందుకు ఫోన్ తీసుకోవడం వల్ల ఈజీగా డైవర్ట్ అయిపోవడం జరిగిపోతుంది. ఒక పని నుంచి మరో పనికి దృష్టి మారినప్పుడు మళ్లీ ఫోకస్ తీసుకురావడానికి మెదడుకు సమయం పడుతుంది. అందుకే ఫోన్‌ను చెక్ చేయడానికి టైమింగ్స్ పెట్టుకోవాలి. అలాగే అవసరం లేని నోటిఫికేషన్లను ఆఫ్ చేసుకుంటే మంచిది.

మల్టీ టాస్కింగ్

మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఓవర్ రేటెడ్ అని చెప్తున్నారు నిపుణులు. కానీ ఇది ఉత్పాదకతను తగ్గించే అలవాటుగా చెప్తున్నారు. ఒకేసారి ఎక్కువ పనులు చేయడం వల్ల ఎక్కువ పని పూర్తి అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ మెదడు ఒకేసారి అన్ని పనులను సమర్థవంతంగా చేయలేకపోవచ్చు. దీనివల్ల అలసట పెరగడం, తప్పులు ఎక్కువ కావడం జరుగుతుంది. అందుకే ఒకేసారి ఒక పనిపై దృష్టి పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ప్రణాళిక లేకపోవడం

రోజు ప్రారంభంలో స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం కూడా సమస్యే అనే చెప్తున్నారు. ఉదయం లేవగానే ఇమెయిల్స్ లేదా మెసేజెస్‌కి స్పందిస్తూ రోజును ప్రారంభిస్తారు. దీంతో తమ పనుల కంటే ఇతరుల పనులకే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. రోజుకు మూడు నుంచి ఐదు ముఖ్యమైన పనులను ముందుగానే నిర్ణయించుకుంటే పని సులభంగా సాగుతుంది. ఒత్తిడి లేకుండా పనిని పూర్తి చేసుకోగలుగుతారు.

బ్రేక్స్ తీసుకోకపోవడం..

ప్రొడెక్టివిటీ కోసం చాలామంది ఎక్కువసేపు బ్రేక్స్ తీసుకోకుండా, ఆగకుండా పని చేస్తారు. ఇది ఉత్పాదకతను పెంచకపోవడంతో పాటు మంచి ఫలితాలను ఇవ్వదని చెప్తున్నారు నిపుణులు. విరామం లేకుండా ఎక్కువసేపు పని చేయడం వల్ల మెదడు అలసిపోతుంది. చిన్న చిన్న విరామాలు తీసుకుంటే మెదడు తిరిగి ఉత్సాహంగా పనిచేస్తుంది.

'Yes' చెప్పడం

మీకు చాలా వర్క్ ఉన్నా.. ఎదుటివారి రిక్వెస్ట్ కాదనలేక వారు చెప్పిన వర్క్ కూడా చేస్తానని చెప్పడం కూడా మీ ప్రొడెక్టివిటీని దెబ్బతీస్తుంది. దీంతో అవసరం లేని పనులు కూడా చేయాల్సి వచ్చి ముఖ్యమైన పనులకు సమయం దొరకదు. కాబట్టి ఏ పని నిజంగా ముఖ్యమో గుర్తించి నిర్ణయం తీసుకోవడం అవసరం.

వర్క్ ప్లేస్

వర్క్ చేసే డెస్క్ ఎంత శుభ్రంగా ఉంటే వర్క్పై అంత ఫోకస్ పెరుగుతుందని చెప్తున్నారు. వర్క్ ప్లేస్ కూడా మిమ్మల్ని డైవర్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి.. డెస్క్ని క్లీన్గా ఉంచుకోండి. ఫోకస్ని పెంచేందుకు, ప్రశాంతతను కలిగించేందుకు మొక్కలు పెట్టుకున్నా మంచిదే.

నిద్రను త్యాగం చేయకండి..

రేపటికి సులభం అవుతుందని.. బాస్ చెప్పాడని రాత్రుళ్లు నిద్ర మాని మరీ వర్క్ చేయడం వల్ల ప్రొడెక్టివిటీ దెబ్బతింటుందని చెప్తున్నారు. ఎక్కువ పని చేయాలని నిద్రను తగ్గించుకుంటే ఏకాగ్రత దెబ్బతినడంతో పాటు జ్ఞాపకశక్తి తగ్గిపోతాయని చెప్తున్నారు. కాబట్టి సరైన నిద్ర తీసుకుంటేనే మెదడు చురుకుగా పనిచేస్తుందని గుర్తించాలి.

ఇవన్నీ సింపుల్ అలవాట్లుగానే కనిపిస్తాయి కానీ.. ఇవి మీరు ప్రొడెక్టివిటీని దెబ్బతీస్తాయని చెప్తున్నారు. కాబట్టి వర్క్లోడ్ని తగ్గించుకోవడానికి, ప్రొడెక్టివిటీని పెంచుకోవడానికి ఈ తప్పులను సరిచేసుకుంటే సరి.