Balakrishna Resumes Dada Shooting In Mysore : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దాదా (Dada). హీరోగా బాలయ్య 111వ చిత్రం ఇది కావడం... 'వీర సింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. జులైలో సినిమా షూటింగ్ సెట్‌లో బాలయ్య గాయపడడంతో కాస్త బ్రేక్ ఇచ్చారు. తాజాగా ఆయన మళ్లీ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టారు.

మైసూరులో షూటింగ్

ప్రస్తుతం మైసూరులో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాలయ్యతో పాటు పలువురు నటులు కీలక షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. కీలక సీన్స్ షూటింగ్ చేసినట్లు మూవీ టీం వెల్లడించింది. ఈ చిత్రాన్ని గోపీచంద్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. బాలయ్యను మాస్ అవతార్‌లో చూపించారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్‌తో పాటు అండర్ వరల్డ్ మాఫియా, గ్యాంగ్ స్టర్ వార్స్, బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ సాగనున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఆమె ప్రభుత్వ అధికారిణిగా నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్‌ను బట్టి తెలుస్తోంది. భగవంత్ కేసరి తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. రాకింగ్ మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా... వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Spy Thriller OTT : థియేటర్లలో మిక్స్‌డ్... ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ - టాప్ ప్లేస్‌లో కార్తి 'సర్దార్ 2'... ట్రెండింగ్‌లో అన్నా తమ్ముళ్ల మూవీస్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.