Crime News: తన భార్యకు వాట్సాప్‌లో ముద్దు, వివాహేతర సంబంధం ఉందని ఇద్దర్నీ హత్య చేసిన భర్త

9 months ago 7
ARTICLE AD

సోషల్ మీడియా కాపురాలు కూల్చడమే కాదు ప్రాణాలను తీస్తోంది. చిన్న అనుమానం ప్రాణాలు తీసే వరకు వదిలిపెట్టడం లేదు. కేరళలో సరిగా ఇలాంటి ఘటన జరిగింది. తన భార్యకు ఆమె స్నేహితుడు పంపిన వాట్సాప్ మెసేజ్ ఏకంగా ఇద్దరు ప్రాణాలు తీసింది.

అసలేం జరిగింది..
కేరళలోని పథనంతిట్ట జిల్లా కలంజూరుకు చెందిన బైజు తన భార్య వైష్ణవితో కలిసి ఉంటున్నాడు. దశాబ్దం కిందటే వీరికి వివాహం కాదా సంతానంగా పదేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వీళ్ళ ఇంటి పక్కనే విష్ణు అనే 30 ఏళ్ల యువకుడు తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇరుగు పొరుగు వారే కావడంతో వీరికి పరిచయం ఉండటంతో వైష్ణవి, విష్ణు సోషల్ మీడియాలోనూ కాంటాక్ట్ లో ఉండేవారు. ఈ క్రమంలో బైజు భార్య వైష్ణవికి పొరుగింటి విష్ణు ముద్దు ఎమోజీ పంపాడు. ఇది గమనించిన బైజు తన భార్య వైష్ణవితో విష్ణుతో రిలేషన్ ఏంటని ఆదివారం రాత్రి గొడవకు దిగాడు.

ఫ్రెండ్ ఇంట్లోకి పారిపోయిన వివాహిత..

తాను ఏం చెబుతున్నా భర్త వినకపోవడంతో భయంతో పక్కింట్లోకి పారిపోయింది. వారి మధ్య ఏదో సంబంధం ఉందని తీవ్ర ఆవేశానికి లోనైనా బైజు కొడవలి తీసుకుని విష్ణు ఇంటికి వెళ్ళాడు. తన భార్య వైష్ణవి ని బయటకి లాక్కొచ్చి కొడవలితో నరికాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన విష్ణు పై సైతం పొడవెంతో దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు బైజును అడ్డుకొని గాయపడిన వైష్ణవి విష్ణును ఆసుపత్రికి తరలించారు. వారిద్దరిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే వారు చనిపోయారని నిర్ధారించారు. స్థానికుల నుంచి సమరం సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు బైజును అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో తన భార్య వైష్ణవికి విష్ణు పంపిన ముద్దు ఎమోజి రెండు హత్యలకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. వారి మధ్య వివాహేతర సంబంధం ఉందని, అందుకే వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నారని, ముద్దు ఎమోజీ పంపడం దానికి నిదర్శనమని విచారణలో నిందితుడు పోలీసులకు చెప్పాడు. భార్య తనను మోసం చేసినందుకు హత్య చేశానని, తన భార్యతో కలిసి తప్పు చేస్తున్న విష్ణుపై కూడా కొడవలితో దాడి చేశానని అంగీకరించాడు.

Read Entire Article