Credit Card Spending Limit:  ఆధునిక జీవనశైలిలో క్రెడిట్ కార్డులు లేనిదే ఒక్కరోజు కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది వచ్చిన జీతాన్ని క్రెడిట్‌ కార్డుకు ఇతర అవసరాలకు ఖర్‌ు పెట్టి మిగతా నెలంతా క్రెడిట్ కార్డుపైనే ఆధారపడుతుంటారు. మరికొందరు క్యాష్‌బ్యాక్ వస్తుందని, పాయింట్లు వస్తాయని, లేదా ఆఫర్స్ ఉన్నాయని వస్తువులు కొంటా ఉంటారు. ఇంకొందరు స్నేహితులు, బంధువులు అడిగారని వస్తువులు కొనడానికి క్రెడిట్ కార్డు ఇస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి వాటితో మీకు ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మీరు క్రెడిట్ కార్డుతో పెట్టిన ఖర్చులకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. లేకుంటే వారి భారీ మొత్తంలో ఫైన్ వేస్తారు. లేదా అంతకు మించిన శిక్షలు కూడా పడే అవకాశం కూడా ఉంది. అందుకే క్రెడిట్ కార్డు వాడే ముందు ఒకటికి పదిసార్లు మీరు ఆలోచించుకోవాలి.

బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇవ్వడంలో చాలా ఉదారంగా ఉంటున్నాయి. 20వేలు జీతం వచ్చిన వ్యక్తికి కూడా లక్ష రూపాయల క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డులు ఇస్తున్నాయి. అలా బ్యాంకులు ఇచ్చే మీ క్రెడిట్ కార్డు ఖర్చుల చరిత్ర ఐటీ శాఖకు చాలా స్పష్టంగా తెలుసు. ఈ ఖర్చులను మీ ఆదాయంతో సరిపోల్చడం ద్వారా, ఐటీ విభాగం మీకు నోటీసులు పంపడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా, అధిక క్రెడిట్ కార్డు ఖర్చులు, తక్కువ ఆదాయం మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు అధికారులు అప్రమత్తం అవుతారు.

ఐటీ శాఖ నిఘా పరిమితులు:

ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు ₹10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేస్తే, ఐటీ డిపార్ట్‌మెంట్ మీ ఆదాయాన్ని, ఖర్చులను కచ్చితంగా చెక్ చేస్తుంది.

నోటీసులకు దారితీసే మూడు పరిస్థితులు:

1. ఆదాయం కంటే ఖర్చు తక్కువగా ఉండటం: మీ ఆదాయం చాలా ఎక్కువగా ఉండి, ఖర్చు తక్కువగా ఉంటే, సమస్య లేదు.

2. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండటం: ఉదాహరణకు, మీ వార్షిక ఆదాయం ₹6 లక్షలు కాగా, క్రెడిట్ కార్డు ద్వారా మీరు ₹12 లక్షలు ఖర్చు చేశారు అనుకుందాం. మీ ఆదాయం ₹6 లక్షలు, కానీ మీరు ఖర్చు పెట్టింది దానికి రెట్టింపు. ఈ వ్యత్యాసం ఐటీ నోటీసు పంపడానికి ప్రధాన కారణం అవుతుంది.

3. ఆదాయమే లేకపోవడం: కొందరు కేవలం క్యాష్‌బ్యాక్ లేదా క్రెడిట్ రొటేషన్ కోసం తరచుగా లావాదేవీలు చేస్తూ ఉంటారు. దీని ద్వారా ఆదాయం లేకపోయినా భారీ ఖర్చులు చూపిస్తే, ఇన్కమ్ టాక్స్, జీఎస్టీ (GST) రెండింటి నుంచి నోటీసులు రావొచ్చు.

స్నేహితుల వల్ల వచ్చే చిక్కులు:

క్రెడిట్ కార్డు వినియోగంలో చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే, ఆఫర్లు లేదా డిస్కౌంట్ల కోసం స్నేహితులు అడిగినప్పుడు కార్డును వారికి ఇవ్వడం. ఉదాహరణకు, మీ మంత్లీ జీతం ₹42,000 మాత్రమే. కానీ మీ స్నేహితుడు సేల్ సమయంలో లక్ష రూపాయల విలువైన ఫోన్ కొనుగోలు చేయడానికి మీ కార్డును ఉపయోగించమని అడిగాడు.

మీ ఫ్రెండ్ బిల్లు జనరేట్ అయిన తర్వాత, మీకు ఆ డబ్బును ఫోన్‌పే ద్వారా తిరిగి పంపవచ్చు. ఈ లావాదేవీ మొత్తం (ఖర్చు చేసిన లక్ష రూపాయలు, తిరిగి వచ్చిన లక్ష రూపాయలు) ఐటీ శాఖ ట్రాక్ చేస్తుంది. మీ ఆదాయం తక్కువగా ఉన్నా, ఒక్క నెలలో ₹1 లక్ష ఖర్చు పెట్టడం, తిరిగి మీ బ్యాంక్ అకౌంట్‌లో ₹1 లక్ష పడటం అనుమానం కలిగిస్తుంది. ఒకసారి ఇలా జరిగితే పర్వాలేదు, కానీ మీరు నాలుగు నెలల్లో నలుగురు స్నేహితుల కోసం ₹4 లక్షలు ఖర్చు పెట్టి, ఆ మొత్తం మీ ఖాతాలోకి తిరిగి వస్తే, ఆటోమేటిక్ వ్యవస్థ మీకు నోటీసు పంపుతుంది. ఎందుకంటే, ఐటీ శాఖ దృష్టిలో ఆ ₹4 లక్షలు ఖర్చు చేసింది మీరే.

మరికొందరు కార్డుల నుంచి డబ్బులు తీయడమో, తీసి స్నేహితులకు ఇవ్వడమో చేస్తుంటారు. ఇది కూడా ప్రమాదకరం. మీరు డబ్బులు తీసి స్నేహితుడికి ఇచ్చిన డబ్బు, అవతల వ్యక్తి మీ అకౌంట్లో వేసిన సొమ్ము కూడా లెక్కలోకి వస్తుంది. ఇది కూడా పరిమితికి మించి ఉంటే కూడా మీరు డేంజర్‌లో పడతారు.

పరిణామాలు:

నోటీసు వచ్చిన తర్వాత, మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే, మీ ఆదాయానికి లెక్క చూపని డబ్బును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ అన్ అకౌంటెడ్ మనీపై 60% నుంచి 400% వరకు పెనాల్టీ వేస్తారు. కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకపోతే, ఐటీ డిపార్ట్‌మెంట్ మీ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయగలదు. మీ ఆస్తులను జప్తు చేయగలదు. ఒక మంత్లీ క్రెడిట్ కార్డు బిల్లు ₹1 లక్ష కంటే ఎక్కువగా కట్టినట్లయితే, బ్యాంక్ వెంటనే ఆ సమాచారాన్ని ఐటీ శాఖకు తెలియజేస్తుంది. అందువల్ల, మీ ఆదాయ పరిధిలోనే క్రెడిట్ కార్డును ఉపయోగించడం అత్యంత కీలకం.