This Indian family is building Dubai most expensive school : హైదరాబాద్‌లో చాలా ఖరీదైన స్కూల్స్ ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, సినీ తారల పిల్లలు చదువుతారని భావించే ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ అనే టాప్ మోడల్ స్కూల్‌లో ఫీజులు ఏడాదికి పన్నెండు లక్షల వరకూ ఉంటుంది. ఇందులో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇది కాకుండా ఇంకా చాలా లగ్డరీ స్కూల్స్ ఉన్నాయి వాటిలో ఏడెనిమిది లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తారు. ఇంత ఫీజులా అని అందరూ ఆశ్చర్యపోతారు. కానీ దుబాయ్‌లో ప్రపంచంలోనే అత్యధిక ఫీజు వసూలు చేసే స్కూల్ పెట్టారు. ఎవరో కాదు మన భారతీయులు.

దుబాయ్ లో ఓ కొత్త స్కూల్‌ను విద్యారంగంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న జెమ్స్ ఎడ్యూకేషన్ అనే సంస్థ.. వంద మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించింది. విద్యార్తులకు లగ్జరీ సౌకర్యాలు మాత్రమే కాదు.. వారికి ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో లీడర్లుగా ఎదిగేందుకు అవకాశం కల్పించేలా చదువు చెప్పేలా అత్యున్నత ప్రమాణాలతో ల్యాబులు.. క్రీడా, టెక్ సౌకర్యాలతో ఈ క్యాంపస్ ఏర్పాటు అయింది. ఇందులో ఫీజును నలభై లక్షల రూపాయలకుపైగా నిర్ణయించారు. అయినా అక్కడ చేర్పించడానికి దుబాయ్ లో కుబేరులంతా పోటీ పడ్డారు.

ఈ స్కూల్ ను నిర్మించింది దుబాయ్ షేకులు కాదు.. మనోడే. ఆయన పేరు సన్నీ వార్కే. కేరళ నుంచి ఆయన తల్లిదండ్రులు దుబాయ్ కు వలస వెళ్లారు. టీచర్లు అయిన సన్నీ వార్కే తల్లిదండ్రులు అక్కడ మొదట ఓ ప్రైవేట్ స్కూల్ పెట్టారు. అది మంచి స్కెస్ కావడంతో జెమ్ ఫౌండేషన్ పేరుతో అ సంస్థను ప్రారంభించి వరుసగా స్కూళ్లు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. దుబాయ్ లో ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్లూ నివసిస్తూంటారు. అందుకే ఇండియన్స్కు.. పాకిస్తానీస్‌కి. బ్రిటన్ వాసులకూ ఇలా విడివిడిగా స్కూల్ ప్రారంభించారు. తర్వాత ఆయా దేశాల్లో ఎందుకు పెట్టకూడదని పలు దేశాల్లో ప్రైవేటు స్కూల్స్ ఏర్పాటు చేశారు.

Also Read: చైనా కొట్టిన దెబ్బ నుంచి అమెరికా కోలుకుంటుందా ? డీప్‌సీక్ దెబ్బకు అమెరికా స్టాక్ మార్కెట్లు క్రాష్!

ఇప్పుడు తమ సంస్థకే తలమానికమైనది ఉండాలన్న ఉద్దేశంతో సన్నీ వార్కే వంద మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టి ఈ స్కూల్ ను నిర్మించారు. ఈ స్కూల్ లో ఉన్న సౌకర్యాలు.. చెప్పబోయే చదువు గురించి విస్తృత ప్రచారం జరగడంతో స్కూల్‌లో అడ్మిషన్లకు ఎదురుచూడాల్సిన అవసరం లేకపోయింది. ఇక్కడ నిర్ణయించిన ఫీజు ప్రపంచంలో ఏ స్కూల్‌తో పోల్చిన అత్యధికం అని చెబుతున్నారు. నలభై లక్షలకుపైగా ఏడాదికి వసూలు చేసే సన్నీ వార్కె.. దానికి తగ్గట్లుగా తమ స్కూల్లో ఫెసిలిటీలు ఉంటాయంటున్నారు.