Sree Vishnu Comrade Kalyan Movie Review: శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కామ్రేడ్ కళ్యాణ్'. ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి పెంచాయి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో విప్లవం కోసం పోరాటం చేసే ఓ యువకుడు ప్రేమలో పడితే? అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. కోన వెంకట్ సమర్పణలో జానకిరామ్ దర్శకత్వం వహించారు. ఇందులో మహిమా నంబియార్ కథానాయిక. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

కథ (Comrade Kalyan Movie Story): అది 1994... ఒరిస్సా సరిహద్దుకు సమీపంలో ఏపీలోని అన్నలు ఏరివేయడానికి ఐపీఎస్ అధికారి జార్జ్ కుట్టి (షైన్ టామ్ చాకో)ను నియమిస్తుంది ప్రభుత్వం. ఆ ప్రాంతంలోని ఓ పల్లెటూరిలో పాడుబడ్డ థియేటర్ రన్ చేస్తుంటాడు కళ్యాణ్ (శ్రీవిష్ణు). అతని తల్లి సరస్వతమ్మ (రాధికా శరత్ కుమార్) బాలకృష్ణకు వీరాభిమాని. ఏదో ఒక పని చేసి పోలీస్ స్టేషన్‌కు వెళితే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి విడిపించుకుని రావడం కళ్యాణ్‌కు అలవాటు అవుతుంది. ఓసారి తల్లిని ప్రమాదం నుంచి కాపాడిన ఒరియా అమ్మాయి సితార దేవి (మహిమా నంబియార్)తో ప్రేమలో పడతాడు.

సితార కోసం ఏమైనా చేయడానికి కళ్యాణ్ సిద్ధపడతాడు. సితార అన్నయ్య చదువు కోసం చేసిన అప్పుల వల్ల వాళ్ళ కుటుంబం ఇబ్బందులు పడుతుందని కళ్యాణ్ తెలుసుకుంటాడు. కుదిరితే అప్పు కట్టమని లేదంటే సితారను ఇచ్చి పెళ్ళి చేయమని బిశ్వాస్ (ఉపేంద్ర లిమాయే) వెంటపడతాడు. ఆ అప్పు కట్టడం కోసం కళ్యాణ్ రిస్క్ చేస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో కామ్రేడ్ కళ్యాణ్ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది? కళ్యాణ్ చేసిన రిస్క్ ఏమిటి? జార్జ్ కుట్టి ఏం చేశాడు? చివరకు సితార ప్రేమను దక్కించుకున్నాడా? లేదా? అనేది సినిమా.

Also Read: Anumana Pakshi Review - 'అనుమాన పక్షి' రివ్యూ: ప్రతిదీ అనుమానించే కుర్రాడు... DJ Tillu దర్శకుడి కొత్త సినిమా ఎలా ఉందంటే?

విశ్లేషణ (Comrade Kalyan Telugu Review): మావోయిస్టు / నక్సల్స్ కాన్సెప్ట్ తెలుగు తెరపై వర్కవుట్ అవ్వదని 'ఆచార్య'తో ఇటు ఇండస్ట్రీ, అటు ఆడియన్స్ బలంగా ఫిక్స్ అయ్యారు. ఆ సినిమా రిజల్ట్ చాలా మంది దర్శక రచయితలను ఆ కాన్సెప్ట్ వైపు ఆలోచించడం మానేసేలా చేసింది. ఈ తరుణంలో 'కామ్రేడ్ కళ్యాణ్' అంటూ శ్రీవిష్ణు సినిమా అనౌన్స్ చేశారు. శ్రీవిష్ణు అంటే కామెడీ సినిమా అని అందరూ ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గట్టు సన్నివేశాలు సైతం ఉన్నాయి. అయితే... అవి పూర్తి స్థాయిలో మెప్పించలేదు.

ప్రతి కథకు ఓ కోర్ పాయింట్ ఉంటుంది. అది పాతదైనా ప్రేక్షకులకు తెలిసిన పాయింట్ అయితే దాని చుట్టూ ఎంత వినోదమైనా పండించవచ్చు. కామ్రేడ్ / మావోయిస్టు / నక్సల్ కాన్సెప్ట్ ఈతరం ప్రేక్షకులలో చాలా తక్కువ మందికి, మరీ ముఖ్యంగా థియేటర్లకు వస్తున్న యువతకు ఓల్డ్ కాన్సెప్టే. ఆర్ నారాయణమూర్తి తెలుసు గానీ... ఆయన ఎర్ర సైన్యం సినిమా చూసిన, గుర్తున్న ప్రేక్షకులు తక్కువ మంది. అందువల్ల, సినిమా ప్రారంభంలో హీరో పరిచయం, ఆ పాట అంతగా కనెక్ట్ అవ్వవు. తర్వాత బాలయ్య అభిమానిగా రాధిక, పోలీసుగా బ్రహ్మాజీ, హీరో స్నేహితుడిగా దుబాయ్ బాబు పాత్రలో సత్య కామెడీ కొంత నవ్వించాయి. అయితే ఇంటర్వెల్ తర్వాత అడివిలోని అన్నల దగ్గరకు కథ వెళ్లిన తర్వాత ఆ స్థాయి కామెడీ పండలేదు. 'జల్సా'లో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య త్రివిక్రమ్ మంచి కామెడీ ట్రాక్ రాశారు. కానీ, ఇక్కడ దర్శకుడు జానకిరామ్ & స్క్రీన్ ప్లే రైటర్ కోన వెంకట్ ఆ మేజిక్ చేయలేదు. ఎమోషన్ కూడా పండలేదు. దాంతో సెకండాఫ్ కాస్త బోర్ కొడుతోంది.

'కామ్రేడ్ కళ్యాణ్'లో విజయ్ బుల్గానిన్ పాటలు ఓకే. అయితే నేపథ్య సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. కథలో కొత్తదనం లేదు. కథనం ఊహించదగ్గ విధంగా ఉంది. జానకిరామ్ పాత సినిమాల తరహాలో తీయడానికి ప్రయత్నించారు. 1990 వాతావరణాన్ని తెరపై చూపించడంలో సినిమాటోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్ సక్సెస్ అయ్యారు. నిర్మాణ విలువలు బావున్నాయి.

శ్రీవిష్ణుకు సవాల్ విసిరే క్యారెక్టర్ ఏమీ కాదు. తన మార్క్ డైలాగ్ డెలివరీ, నటనతో ఈజీగా చేసేశారు. మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్ స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు. సత్య మరోసారి తన ట్యాలెంట్ చూపించారు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన యువకుడిగా నవ్వించారు. సుదర్శన్ కామెడీ కూడా పర్వాలేదు. షైన్ టామ్ చాకో, శత్రు, రఘుబాబు, మురళీధర్ గౌడ్ తదితరులు రెగ్యులర్ రోల్స్ చేశారు.

Also Read: Don't Trouble The Trouble Review - 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' రివ్యూ: నిర్మాతగా రాజమౌళి తనయుడు తీసిన సినిమా - హిట్టా? ఫట్టా?

Comrade Kalyan Verdict: 'కామ్రేడ్ కళ్యాణ్'లో కామెడీ ఉంది. పలు సన్నివేశాల్లో నవ్వించింది. అయితే... శ్రీవిష్ణు సినిమా అనేసరికి సహజంగా కొన్ని అంచనాలు ఏర్పడతాయి. వినోదం ఫుల్లుగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. ఆ స్థాయిలో సినిమా లేదు. కామ్రేడ్ కాన్సెప్ట్ కొంత కామెడీకి హెల్ప్ అయ్యింది కానీ ఎమోషన్స్‌ వర్కవుట్ అవ్వడంలో హెల్ప్ చేయలేదు. శ్రీవిష్ణుతో పాటు సత్య నవ్వించారు. వాళ్ళ వినోదం కోసం ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళడం మంచిది.

Also Read: Nani The Paradise Review - 'ది ప్యారడైజ్' రివ్యూ: నాని మాస్ మసాలా బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? సినిమా హిట్టా? ఫట్టా?