రీసెంట్ టైమ్స్‌లో మోస్ట్ పాపులర్ కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే... అది 'సత్య' అని చెప్పవచ్చు. సినిమాలు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ, సత్య కామెడీ మాత్రం ఫెయిల్ కాలేదు. అందుకు రీసెంట్ ఎగ్జాంపుల్... 'మిత్ర మండలి'. సినిమాలో సత్య ఉంటే కామెడీకి లోటు లేదని పేరు తెచ్చుకున్నాడు. తన కామెడీ టైమింగ్, డైలాగ్స్‌తో పలు సినిమాలను గట్టెక్కించాడు. సత్య కామెడీ సినిమాకు అసలైన హీరో అని పేరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సత్య హీరోగా మారుతున్నాడు. అతడిని హీరో చేస్తున్నది ఎవరో తెలుసా?

సత్య హీరోగా సినిమా... ఆ దర్శకుడు వదల్లేదు!
కమెడియన్‌గా సత్యకు పేరు తెచ్చిన సినిమాల్లో 'మత్తు వదలరా', 'మత్తు వదలరా 2' ముందు వరుసలో ఉంటాయి. ఆ రెండు సినిమాలకు దర్శకుడు ఒక్కరే... రితేష్ రాణా. ఆ రెండిటికీ మధ్యలో ఆయన తీసిన లావణ్య త్రిపాఠి 'హ్యాపీ బర్త్ డే'లోనూ సత్య కామెడీ సూపర్బ్ అని చెప్పాలి. ఇప్పుడు సత్య, రితేష్ రాణా కలయికలో మరో సినిమా రాబోతోంది.

ఇప్పటి వరకు రితేష్ రాణా (Ritesh Rana) దర్శకత్వం వహించిన సినిమాల్లో హీరోలకు స్నేహితుడిలా లేదంటే హాస్య నటుడిగా కనిపించారు. కానీ ఇప్పుడు హీరోగా చేయబోతున్నారు. అవును... సత్య హీరోగా సినిమా చేయడానికి రితేష్ రాణా ఒక స్క్రిప్ట్ రెడీ చేశారని తెలిసింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆ సినిమా ఉండబోతుందట. ఇటీవల కథ విన్న సత్య, ఆ సినిమా చేయడానికి 'ఎస్' చెప్పారని టాలీవుడ్ టాక్.

Also Read: రజనీకాంత్ 'జైలర్ 2'లో బాలీవుడ్ భామ.. విలన్ కూతురిగా!?

హాస్య నటుడిగా సత్య ఫుల్ బిజీ. డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి. 'సుందరకాండ' సినిమాలో తనది రెగ్యులర్ రోల్ అని, అటువంటి చేశాను కనుక చేయలేనని చెబితే సినిమాకు హెల్ప్ అవుతుందని మరీ అతడిని ఒప్పించినట్టు నారా రోహిత్ తెలిపారు. హాస్య నటుడిగా సత్యకు అంత డిమాండ్ ఉంది. ఈ తరుణంలో ఓ కథలో హీరోగా నటించడానికి ఓకే చేశారంటే... అది సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి.

Also Read: బాలకృష్ణకు జంటగా మరోసారి నయనతార... ఈసారి హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలో!