Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా

10 months ago 8
ARTICLE AD
<p>ఏపీలో సంక్రాంతి సందర్భంగా జోరుగా కోడి పందెలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తగ్గేదేలే అన్నట్లుగా కోడి పందెలు, వాటిపై భారీగా బెట్టింగ్స్ సైతం వేస్తున్నారు. కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. గెలిచిన వారికి మహింద్రా థార్ ను సైతం గిఫ్ట్&zwnj;గా ప్రకటించారు నిర్వాహకులు. కరప పందెం బరి గెలచిన వారికి థార్ వాహనం గిఫ్ట్ అని జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.&nbsp;</p> <p>ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోడి పందాలు నిర్వహిస్తున్న బరులకు వెళ్లి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమీరంలో కోడి పందాలను రఘురామ ప్రారంభించారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహించిన కోడి పందేల్లో కోళ్లకు కత్తులు లేకుండా పందెలు వేశారు. అయినా సరే తమ పుంజుదే విజయం అంటే, కాదు మాదే అంటూ కోడిపుంజుల ఓనర్లు మీసాలు మెలేస్తున్నారు.</p>
Read Entire Article