CM Revanth Reddy Once Again Respond Over Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టుపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ప్రస్తుతం దావోస్ (Davos) పర్యటనలో ఉన్న ఆయన బుధవారం ఓ ఆంగ్ల మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని ప్రశ్నించగా.. '2 రోజుల ముందు అనుమతి కోసం వస్తే.. పోలీసులు నిరాకరించారు. అయినా, ప్రీమియర్ షో రోజున థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారు. ఈ క్రమంలో భారీగా అభిమానులు తరలిరావడంతో ఆయనతో వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అక్కడున్న వారిని తోసేశారు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. ఆమె పిల్లాడికి తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓ మనిషి చనిపోవడం అన్నది అతని చేతుల్లో లేకపోవచ్చు. ఘటన జరిగి 10 -12 రోజులైనా బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఈ ఘటనకు సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోయింది.' అని తెలిపారు.

కాగా, పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Also Read: Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు