CJP Protests: ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
2 weeks ago 2
ARTICLE AD
UN on Delhi Protests | న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం నిరసనకారుల సామూహిక నిర్బంధాలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం (OHCHR) ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి షరతులు లేకుండా నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని ఐరాస విభాగం చెప్పగా.. మీ జోక్యం అనవసరమంటూ భారత్ ఘాటుగా స్పందించింది. ఐరాస వ్యాఖ్యలు ‘పూర్తిగా తప్పుదారి పట్టించేవి. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యం అనవసరం’ అని జెనీవాలోని భారత శాశ్వత మిషన్ పేర్కొంది.
ఐరాస వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన భారత్
శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిందని, అయితే ప్రజా శాంతి కోసం సహేతుకమైన పరిమితులు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అధికారులు చట్టాలు, రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తున్నారని, ఫిర్యాదులు చేసేందుకు కోర్టులు సైతం అందుబాటులో ఉన్నాయని జెనీవాలోని భారత శాశ్వత కమిషన్ పేర్కొంది. ఇతర దేశాల్లో జరిగే పెద్ద నిరసనలపైనా ఐరాస ఇదే విధంగా ఫోకస్ చేయాలని సూచించింది. ఒకవైపు నిరసన పోరాటం, నిర్బంధాలపై ఐరాస ఆందోళన వ్యక్తం చేయగా.. మరోవైపు దేశ సార్వభౌమత్వం, శాంతి భద్రత పేరుతో భారత్ దీటుగా బదులిచ్చింది. ఈ విషయంలో ఐరాస జోక్యం అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని భారత్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీలో మరోసారి నిర్బంధాలపై ఐరాస ఆగ్రహం..
సీజేపీ నిరసనకు పిలుపునివ్వడంతో పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు, లాయర్లు, ఇతర రంగాలకు చెందిన వారు ఢిల్లీలోని జంతర్ మంతర్ కు తరలివచ్చే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు ఎక్కడికక్కడా నిర్బంధాలు చేసి నిరసనకారులను అడ్డుకోవడంపై యూనైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిటీ(UNHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని, ఎలాంటి షరతులు లేకుండా వెంటనే వారిని విడుదల చేయాలని సూచించింది. శాంతియుతంగా నిరసన తెలపకుండా చేయడం, వారిని అక్రమంగా నిర్బంధించడంపై తమకు ఆందోళన ఉందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం (OHCHR) అధికార ప్రతినిధి థమీన్ అల్-ఖీతాన్ తెలిపారు.
ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో నిరసనలు, నిర్భంధాలపై ఓ పోస్టు చేసింది. ‘ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న మాస్ నిర్బంధాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఏకపక్షంగా నిర్బంధించిన వారిని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలి. నిరసనకారులు, పౌర సమాజ ప్రతినిధులు, లాయర్లు, జర్నలిస్టులు, సామాజికవేత్తలు శాంతియంగా నిరసన తెలిపేందుకు అవకాశం కల్పించాలి. వారు సమావేశమై సమస్యలపై చర్చించడం, మాట్లాడే హక్కులను కాలరాయవద్దు. నిరసనకారుల పట్ల ఢిల్లీ పోలీసులు సంయమనం పాటించాలి. వారు లేవనెత్తిన ఆందోళనలపై అవసరమైతే ప్రభుత్వం చర్చలు జరపాలి. శాంతియుతంగా నిరసన తెలపడాన్ని గౌరవించాలి. ఒకవేళ పరిస్థితి అదుపుతప్పితే గానీ శాంతియుతంగా నిరసన తెలిపేవారిపై ఆంక్షలు విధించవద్దు. అప్పటివరకూ ఎవరినీ నిర్బంధాలు చేయవద్దు. నిర్బంధించిన వారిని తక్షణమే విడుదల చేసి నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని’ OHCHR భారత ప్రభుత్వానికి సూచించింది.
Read Entire Article