Chitti Chitti Cheema Song Lyrics: చిట్టి చిట్టి చీమ లిరిక్స్... దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' కోసం శ్రీమణి ఏం రాశారంటే?
3 months ago 7
ARTICLE AD
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా తెలుగు దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'అనగనగా ఒక తార' (Aakasamlo Oka Tara Movie). ఇందులో సాత్విక వీరవల్లి, శృతి హాసన్ కథానాయికలు. దుల్కర్ పుట్టినరోజు (జూలై 28న) సందర్భంగా సినిమాలోని ఫస్ట్ సింగిల్ 'చిట్టి చిట్టి చీమ...'ను విడుదల చేశారు.
అమ్మాయి కలకు అండగా నిలబడ్డ అబ్బాయి!
'చిట్టి చిట్టి చీమ...'ను డైరెక్టుగా విడుదల చేయలేదు. హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, సాత్వికకు తోడు నటుడు రాజ్ కుమార్ కసిరెడ్డిపై ఓ సన్నివేశాన్ని చూపించారు. ఆస్ట్రోనాట్ అవ్వాలనుకునే అమ్మాయిగా సాత్వికను, ఆమెకు అండగా నిలబడే యువకుడిగా దుల్కర్ సల్మాన్ కనిపించారు.
పల్లవి:
చిట్టి చిట్టి చీమ చిట్టి చేతుల హయ్యో రామ
వంద టన్నుల చక్కెర మోస్తుందమ్మా
కొండపల్లె బొమ్మ కొండా కోన దాటిందమ్మ
తన కలల వైపు నడిచిందమ్మా
ఏమంటారో ఏమిటో ఏమిటో ఏమో కదా
జంటే కానీ జంటనే ఏమంటారో ఏమో కదా
ఏమవుతుందో ఏమిటో ఏమిటో ఏమో కదా
అటో ఎటో వైనమే ఎటెలుతుందో ఏమో కదా
చరణం 1:
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే విచ్చను రెక్కలిలా
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే వందల కొద్దీ విచ్చను రెక్కలిలా
చరణం 2:
ఈ నెలపైనే ఒక్కొక్క మెట్టు కట్టేసుకుంటెళ్ళు
ఏదో రోజు నింగికి నిచ్చెన కాదా
రేపటిలోనే నిన్నుంచుకుంటూ తొక్కాలి పరవళ్ళు
నెటిలోని కష్టం నిన్నటిదే అయిపోదా
Also Read: Bomma Bomma Song Lyrics - బొమ్మ బొమ్మ లిరిక్స్... పూజా హెగ్డేతో దుల్కర్ రొమాంటిక్ మెలోడీ - 'శ్రీ శ్రీ' కోసం అనంత శ్రీరామ్ ఏం రాశారంటే?
విసిరే ఎదురు కానే లేని గాలి పటమంటుందా
ఉంటే అది చలనం లేని గదిలో కూడా పటమైపోదా
ఎదరే ఉంటే కుండని కుండని ఆగకు అని
చెయ్యే పట్టి నడపడం అందరి వల్ల కాని పని
ఏదేమైతే తప్పని తప్పని లెక్కేంటి అని
అంతా ఉన్నా పదమని చెప్పా కదా ప్రాణం తనే
ముగింపు:
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే విచ్చను రెక్కలిలా
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాలా
రివ్వు రివ్వుమని వాటికవే వందల కొద్దీ విచ్చను రెక్కలిలా
Also Read: Kalatheylaa Song Lyrics - కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్
జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన 'చిట్టి చిట్టి చీమ...' పాట హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ పాటను శ్రీమణి రాయగా... రమ్య బెహరా ఆలపించారు.
Read Entire Article