Chiranjeevi's Wow Moment In Chennai Love Story Event : వావ్... వావ్... వై నాట్... ఇదీ ఓ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి స్పాంటేనియస్‌గా చెప్పిన డైలాగ్. ఈ డైలాగ్ చెప్పే టైంలో ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ వేరే లెవల్. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయశాంతి రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ... చిరు ఈ డైలాగ్ చెప్పారు.

ఆ తర్వాత చిరు డైలాగ్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నప్పుడు, ఎవరినైనా అమితంగా పొగడాల్సి వచ్చినప్పుడు ఈ వావ్ మూమెంట్‌ను నెటిజన్స్ తెగ వాడేశారు. చివరకు డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీలో చిరుతో ఈ డైలాగ్ స్పెషల్ రీ క్రియేట్ చేయించారు. చిరు నోటి నుంచి వచ్చిన ఈ చిన్న డైలాగ్ ఓ ఐకానిక్‌గా నిలిచింది. చాలా ఇంటర్వ్యూల్లో తన డైలాగ్‌పై మీమ్స్ క్రియేట్ కావడంపై స్వయంగా చిరంజీవినే ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. నార్మల్‌గా చెప్పిన డైలాగ్ ఇంత ఫేమస్ అవుతుందని అనుకోలేదని అన్నారు. తాజాగా మరోసారి వావ్ మూమెంట్‌తో అలరించారు చిరు.

మణిశర్మ మ్యూజిక్ వావ్ అంటూ...

రీసెంట్‌గా కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మను ప్రశంసిస్తూ... తనదైన స్టైల్‌లో అంతే ఐకానిక్‌గా వావ్ మూమెంట్‌తో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 'మణిశర్మ ఎన్నెన్ని సినిమాలకు సూపర్ మ్యూజిక్ అందించాడు. వావ్...' అంటూ అలరించారు. తన స్పీచ్‌ను కూడా వావ్ అనే డైలాగ్‌తోనే ముగించారు మెగాస్టార్. ఈ వీడియో వైరల్ అవుతుండగా... చిరు వావ్ అంటూ చెప్పే విధానం ఎప్పటికీ ఐకానికే అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Mega WOW Moment

Chennai Love Story Mega Pre-Release Event #Chiranjeevi #ChennaiLoveStory #kiranabbavaram #SriGouriPriya #skn manisharma ChennaiLoveStoryOnJuly24 SaiRajesh RaviNamburi pic.twitter.com/Ea3twrsBXX

— SNR_Talks (@SNR_Talks) July 22, 2026

Also Read : Jana Nayakudu Review - 'జన నాయకుడు' రివ్యూ: 'భగవంత్ కేసరి' రీమేకేనా? విజయ్ సినిమా ఎలా ఉందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన క్యూట్ లవ్ ఎంటర్టైనర్ చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story). రవి నంబూరి దర్శకత్వం వహించిన సినిమాలో సిరి హన్మంతు, నరేష్, పూజ తదితరులు కీలకపాత్రలు పోషించారు. SKN, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిశర్మ మ్యూజిక్, ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.