Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా కళ్లు తిరిగి పడిపోయిందని మిత్ర లక్ష్మీని తీసుకొని ఇంటికి వస్తాడు. మిత్ర డాక్టర్‌ని మనీషాకి ఏమైందని అడుగుతాడు. దాంతో డాక్టర్ మనీషా ప్రెగ్నెంట్ అని చెప్తుంది. మిత్ర, లక్ష్మీలతో పాటు అందరూ బిత్తరపోతారు. దేవయాని, మనీషాలు గదిలో తన గేమ్ మొదలైందని అనుకుంటారు. మనీషా మామయ్య డాక్టర్‌తో అదెలా సాధ్యం మనీషాకి ఇంకా పెళ్లే కాలేదని మనీషాని కోపంగా పిలుస్తాడు. మనీషాని దేవయాని తీసుకొని కిందకి వస్తుంది.

అంకుల్: నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తున్నారు నిజమేనా. ఎవరు మనీషా ఈ మిత్ర ఏనా. అంటే నేను విన్నది నిజమేనా. మిత్ర ఫ్రెండ్ అని నమ్మి మీ ఇంట్లో ఉన్నందుకు మనీషాకి ఇంత అన్యాయం చేస్తావా. తన జీవితం నాశనం చేస్తావా. నువ్వు అసలు మనిషివేనా ఫ్రెండ్‌వేనా.
మనీషా: ఆపండి అంకుల్. మిత్రని ఏం అనొద్దు. ఇది మా ఫ్యామిలీ మేటర్ మేం చూసుకుంటాం.
అంకుల్: నేను నీ అంకుల్ని మనీషా. నీకు పెళ్లి చేసి అందమైన జీవితం ఇవ్వాలని అనుకున్నాను. ఈ మిత్ర అంతా నాశనం చేసేశాడు.
మనీషా: ఇంకొక్క మాట మిత్ర గురించి అంటే బాగోదు అంకుల్. ఇదే నా ఇళ్లు ఇక్కడే నా జీవితం చావు అయినా బతుకు అయినా అంత ఈ కుటుంబంతోనే. ఇక్కడే నా జీవితం ఉంది. నా భవిష్యత్ ఉంది. నాకు అన్నీ మిత్రనే. నా ఫ్రెండ్ గైడ్, ఫిలాసఫర్ ఇంకా చెప్పాలి అంటే నా భర్త కూడా మిత్రే.
అంకుల్: అన్ని మాటలు నువ్వే చెప్తున్నావ్ మిత్ర ఒక్క మాట అనడం లేదు.
మనీషా: గెటవుట్ అంకుల్.
దేవయాని: అదేంటి మనీషా మీ మామయ్యని అంత మాట అన్నావ్.
మనీషా: నాకు ఎవరైనా మిత్ర తర్వాతే.. మిత్ర ఒక్కడు ఉంటే నాకు చాలు ఇంకెవ్వరూ వద్దు.

మిత్ర ఇంట్లో అందరూ తలో దిక్కు కూర్చొని బాధ పడతారు. మనీషా, దేవయాని మాత్రం నవ్వుకుంటారు. లక్ష్మీ మెట్ల మీద కూర్చొని ఏడుస్తుండటం చూసి మిత్ర బాధగా వెళ్లిపోతాడు. దేవయాని వివేక్, జానులతో మీరు హాస్పిటల్‌కి వెళ్లారు ఏమైంది అని అడుగుతుంది. ఇంట్లో అంత పెద్ద సమస్య ఉంటే ఇప్పుడు ఇది అవసరమా అని వివేక్ అడిగితే నాకు మన గురించి ముఖ్యం వాళ్ల గురించి కాదని అంటుంది. దాంతో వివేక్ జానులో ఏం ప్రాబ్లమ్ లేదని తనలోనే ప్రాబ్లమ్ ఉందని అంటాడు. మా ఇద్దరికీ మందులు వాడమని చెప్పారని అంటాడు. దేవయాని షాక్ అయిపోతుంది. రిపోర్ట్స్ అడుగుతుంది. వివేక్ తల్లికి రిపోర్ట్స్ ఇస్తాడు. ఇందులో డాక్టర్ అడ్రస్ అన్నీ ఉన్నావ్ వెళ్లి ఎంక్వైరీ చేసి నా పరువు తీసేయ్ అని అరుస్తాడు. జాను వివేక్ దగ్గరకు వెళ్లి నిజంగా ప్రాబ్లమ్ మీకేనా అంటే మరి నీకు ప్రాబ్లమ్ ఉంటే నేను నా మీద వేసుకుంటున్నానా నువ్వు కావాలంటే ఎంక్వైరీ చేసుకో అని అంటాడు. వివేక్ బయటకు వెళ్లి కన్నీరు పెట్టుకొని జానుకి నిజం తెలీకూడదని అనుకుంటాడు.

ఉదయం లక్ష్మీ దిగులుగా కూర్చొన్న రాజేశ్వరిదేవి, జయదేవ్‌లకు కాఫీ ఇస్తూ చకచకా టిఫెన్ల గురించి చెప్తుంది. ఇద్దరూ లక్ష్మీతో అంత పెద్ద గొడవ జరిగితే ఏం పట్టనట్లు ఉన్నావ్ అంటాడు. మనీషా అబద్ధం ఆడుతుంది రాని కడుపు వచ్చినట్లు నాటకం ఆడుతుందని కానీ తను చెప్తుంది నిజం కాదని నిలదీస్తే మిత్ర ఇంకా బాధ పడతారని ఆగిపోతున్నా అని అంటుంది. ఎక్కువ గొడవ చేస్తే మిత్రని తీసుకెళ్లిపోయి వేరే కాపురం పెడుతుందని అంటుంది. కాస్త ఓపిక పట్టాలని లక్ష్మీ అంటుంది. మనీషా దగ్గరకు దేవయాని వెళ్లి ఇంటిళ్ల పాది ఇంట్లో శవం లేచినట్లు దిగులుగా ఉన్నారని చెప్తుంది. మనీషా దేవయానితో ప్రాబ్లమ్ వివేక్‌కి లేదని జానుకి ఉందని నా అనుమానం ఉందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!