Chinni Serial Today September 6th: చిన్ని సీరియల్: తన ఆచూకీ ట్రేస్ చేసున్నారని తెలుసుకున్న లోహిత ఏం చేయనుంది? తులసి మహి, మధులను కలుపుతుందా!
3 months ago 3
ARTICLE AD
Chinni Serial Today Episode హల్దీ వేడుక తర్వాత మధు చాలా ఏడుస్తుంది. ఇంతలో స్వప్న మధు దగ్గరకు వచ్చి మ్యాడీ గురించే ఆలోచిస్తున్నావ్ కదూ.. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు మ్యాడీ గురించే ఆలోచిస్తావని నాకు తెలుసు. పెళ్లి పనులు పసుపు కొట్టడంతో మొదలు పెడతారు. ఆ పసుపే నిన్ను మ్యాడీని ఆశీర్వదించింది. దేవుడు మీ ఇద్దరి ప్రేమని ఆశీర్వదిస్తాడని నా మనసుకి అనిపిస్తుందని స్వప్న అంటుంది. 
మధు ఏడుస్తూ మ్యాడీతో జీవితం పంచుకునే అదృష్టం నాకు లేదు.. చిన్నప్పటి నుంచి నా జీవితం ఇంతే నేను ఏది అయితే ఇష్టపడతానో అదే నాకు దూరం అవుతుంది. అమ్మ అంటే చాలా ఇష్టం.. పదేళ్ల పాటు అమ్మతో జైల్లో ఉన్నాను. పదేళ్ల తర్వాత అమ్మకి దూరం అయిపోయాను.. నాన్న గురించి తెలిశాక నాన్నని ఇష్టపడ్డాను..  నాన్న, అమ్మతో కలిసి సంతోషంగా ఉండొచ్చు అనుకున్నా కానీ అమ్మ శాశ్వతంగా దూరం అయిపోయింది. నాన్న ఎక్కడున్నారో తెలీదు. మామయ్య శాశ్వతంగా దూరం అయిపోయారు.. మామయ్య ఫ్యామిలీ దూరం అయిపోయింది.. ఎంతో ప్రేమగా పెంచుకున్నారు ఈ  అమ్మానాన్న. దేవుడు ఇచ్చిన ఈ అమ్మానాన్నల్ని కూడా చాలా ఇష్టపడ్డాను కానీ ఇప్పుడు ఈ అమ్మానాన్నల్ని కూడా దూరం చేసుకొని ముక్కూముఖం తెలియని వాళ్లని పెళ్లి చేసుకొని వెళ్లిపోవాలి. ఆడపిల్లకి ఇంత కంటే దురదృష్టం ఏం ఉండదు అని మధు చాలా ఏడుస్తుంది. స్వప్న మధుని ఓదార్చుతుంది. మ్యాడీ నీ జీవితంలోకి వస్తాడని అనిపిస్తుందని అంటుంది. మధు స్వప్నని పట్టుకొని ఏడుస్తుంది. 
మధు తులసి కోటకి పూజ చేయిడానికి అందరితో కలిసి వస్తే మహి ఫొటోలు వీడియోలు తీస్తాడు. మధు మహినే చూస్తూ ఉంటుంది. ఇక తులసి ఆకు తీసుకోమని మధుతో వాళ్ల అమ్మ చెప్తే నేను ఇస్తా అని మహి ఇస్తాడు. మధు తీసుకొని కళ్లకు అత్తుకొని తీసుకుంటుంది. ఇక మధు ప్రదక్షిణలు చేస్తుంటే మధు చీరకు నిప్పు అంటుకుంటుంది. మ్యాడీ చూసి కంగారు పడతూ నిప్పు అపుతాడు. మహి చేతికి గాయం అవ్వడం చూసిన మధు కంగారు పడుతూ తన తలలో పెట్టిన తులసి ఆకు పసరు మహికి రాస్తుంది. మధు తల్లడిల్లిపోతుంది. ఇక చీర మార్చుకోవడానికి మధు వెళ్తుంది. 
మ్యాడీతో తన ఫ్రెండ్ తులసి కోట వైపు ఎందుకు అలా చూస్తున్నావ్ అంటే చిన్నప్పడు నాకు తులాభారం అయిందని చెప్తాడు. లోహిత ఫోన్ ట్యాప్ చేసి ఇంటికి వెళ్తుంటారు. దాంతో లోహిత వాళ్లని ఎలా ఆపాలా అని అనుకుంటూ మహికి కాల్ చేస్తే ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది దాంతో వాళ్లు డైవర్ట్ అయిపోతారని అనుకొని లోహిత మహికి కాల్ చేస్తుంది. మహి సంతోషంగా కాల్ లిఫ్ట్ చేస్తాడు. మహి మాట్లాడుతుంటే వాళ్లు కాల్ వింటూ ఉంటారు. మహి లోహితతో నిన్ను కలవాలి అంటే ఇప్పుడు కాదు తర్వాత కలుద్దామని అప్పటి వరకు కాల్ చేయొద్దని చెప్తుంది. మొత్తానికి లోహిత మహి కాల్ ట్రేస్ చేస్తున్న వాళ్లని డైవర్ట్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
Read Entire Article