Chinni Serial Today Episode మధు, మ్యాడీ ఇద్దరూ ఆజంనేయ స్వామి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టాలని అనుకుంటాడు. మ్యాడీ నిమ్మకాయ దీపం వెలిగించి నా చిన్ని నాకు కనపడేలా ఆశీర్వదించు స్వామి అని మహి దండం పెట్టుకుంటాడు. తర్వాత మధు అక్కడికి వెళ్లి స్వామికి దండం పెట్టుకొని నిమ్మకాయ దీపం వెలిగిస్తుంది.

నాగవల్లి వాళ్లు ప్రదక్షిణలు చేస్తుంటారు. దేవా కూడా గుడికి వస్తుంటాడు. మ్యాడీని నాగవల్లి వాళ్లు చూడరు.. దేవా గుడిలోకి వస్తూ కంగారుగా తిరుగుతున్న మ్యాడీ తండ్రికి గుద్దేసి సారీ అంటాడు. మ్యాడీని దేవా చూసి కన్నతండ్రికి సారీ చెప్పే పరిస్థితికి వచ్చావ్ అన్నమాట అంటాడు. నీ కంగారు చూస్తే ఎవరి కోసమో వచ్చావని అర్థమైంది మా కోసం రాలేదన్నమాట అంటాడు. దానికి మహి అవును డాడీ నేను చిన్ని కోసం వచ్చానని అంటాడు. నువ్వు ఇంకా మారవా.. నువ్వు ఇంటికి వస్తావ్ సంతోషంగా ఉంటావ్ అని నీ కోసం ఆ పిచ్చి తల్లి యజ్ఞాలు యాగాలు చేస్తుంది. తన కోసం నేను ఈ యాగానికి ఒప్పుకున్నానో కానీ నువ్వు రావు అని నాకు తెలుసు అంటాడు దేవా. మీ మనసు మీరు మార్చుకోకపోతే నేను నా మనసు ఎలా మార్చుకుంటా డాడీ.. మీరు దేవేంద్ర వర్మ అయితే నేను ది గ్రేట్ దేవేంద్ర వర్మ కొడుకుని.. మీరు మీ మనసు మాట విన్నట్లు నేను కూడా నా మనసు మాట మాత్రమే వింటా అని అంటాడు. ఈ జన్మలో నీకు చిన్ని కనపడదురా అది బాగా అర్థం చేసుకో అని దేవా వెళ్లిపోతాడు.

మధు దీపం వెలిగించి నాకు దూరం అయిన వాళ్లు అందరూ దగ్గరయ్యేలా అది మహితోనే జరిగేలా చూడు స్వామి అని కోరుకుంటుంది. అప్పుడే మధు మ్యాడీ పెట్టిన నిమ్మకాయ దీపం చూసి ఇది మహి పెట్టాడని నా మనసు చెప్తుంది. మహి కోసం వెతుకుతా స్వామి మహిని వెతుకుతా మహిని తీసుకొని నీ దగ్గరకు వచ్చి ఇద్దరం నిన్ను దర్శించుకుంటాం అని అంటుంది. మహి అంటూ మొత్తం వెతుకుతుంది. మ్యాడీ కూడా చిన్ని కోసం వెతుకుతాడు.

మ్యాడీ కూడా చిన్ని కోసం మొత్తం వెతికి చివరకు ఆంజనేయస్వామి దగ్గరకు వచ్చి నిమ్మకాయ దీపం చూస్తాడు. చాలా చాలా హ్యాపీగా ఫీలయై చిన్ని కూడా ఇక్కడికి వచ్చిందా అని సంబరపడిపోతాడు. ఇద్దరూ చెరో వైపు ఒకరి కోసం ఒకరు వెతుక్కుంటూ ఉంటారు. దేవా నాగవల్లి వాళ్ల దగ్గరకు వెళ్తారు. నాగవల్లి దేవాని చూసి ఏమైంది ఎందుకు అలా ఉన్నావ్ బావ అని అడుగుతుంది. వాడు వచ్చాడు అని దేవా మ్యాడీ కోసం చెప్తాడు. నాగవల్లి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. యాగం మొదలు పెట్టకముందే నా కొడుకు వచ్చేశాడు వాడిని ఇప్పుడే తీసుకొస్తా అని నాగవల్లి అంటే.. వెళ్లొద్దు అని అంటాడు. వాడు మనకోసం రాలేదు చిన్ని కోసం వచ్చాడు అని దేవా చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. దాంతో నాగవల్లి మ్యాడీని తీసుకురాను వాడే నా దగ్గరకు వస్తాడు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.