Chinni Serial Today Episode మ్యాడీ లవ్ మ్యాటర్‌ మధు వాళ్ల ఇంట్లో తెలిసి అందరూ లవ్ సక్సెస్ అవుతుందని అంటారు. చందు, సరళ చాలా టెన్షన్ అవుతారు. లోహితకు కాల్ చేస్తూనే ఉంటారు. వీళ్లేంటిరా బాబు ఉంచరు.. కాల్ లిఫ్ట్ చేయకపోతే చంపేసేలా ఉన్నారు అని హలో హలో నేను ట్రిప్‌లో ఉన్నాను అని కట్ చేసి స్విఛ్‌ ఆపేస్తుంది.

వరుణ్ రాగానే వరుణ్‌తో నా పరిస్థితి చూడు వరుణ్‌.. నా ఫ్యామిలీతో అబద్ధాలే చెప్పని నేను అబద్ధాలు చెప్తున్నా త్వరగా నన్ను మీ ఇంటికి తీసుకెళ్లు వరుణ్ తర్వాత మన రెండు ఫ్యామిలీలను ఒకటి చేసేద్దాం అని హగ్ చేసుకుంటుంది. అలాగే అని వరుణ్ అంటాడు.

మధుతో స్వరూప రాత్రి మ్యాడీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నాడు అన్నావ్ కదా పట్టు మంచాల మీద పడుకునే వాడు నేల పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని అంటుంది. నువ్వేం బాధ పడకు అమ్మ నా దగ్గర ఓ ఐడియా ఉంది నేను చూసుకుంటా అని మధు చెప్తుంది. తన చున్నీలన్నీ కలిపి మ్యాడీ కోసం మేడ మీద టెంట్‌లా చేసి పడక ఏర్పాటు చేస్తుంది.

మ్యాడీ దగ్గరకు మధు వెళ్లి సర్‌ఫ్రైజ్ అని చెప్పి మేడ మీదకు తీసుకెళ్తుంది. మేడ మీద తన చున్నీలతో ఏర్పాటు చేసిన పడక చూసి మ్యాడీ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. నీలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం అని అంటాడు. ఇక మధు గుడ్‌నైట్ చెప్పి వెళ్లి పడుకోమని అంటుంది. అంతలోనే ఇద్దరూ ఒకేసారి నెలవంక చూసి ఒకర్ని ఒకరు పిలుచుకొని నెలవంక చూస్తారు. ఇద్దరూ కళ్లు మూసుకొని దండం పెట్టుకుంటారు. మధు హ్యాపీగా ఉండాలి మధు కోరిక నెరవేరాలని మ్యాడీ కోరుకుంటే మ్యాడీ హ్యాపీగా ఉండాలి మ్యాడీ ఏం కోరుకుంటే అది నెరవేరాలని మధు కోరుకుంటుంది. ఇద్దరూ తర్వాత ఒకర్ని ఒకరు చూసుకుంటారు. మ్యాడీ హ్యాపీగా పడుకుంటాడు. మధు మ్యాడీని చూసి ఎంత చక్కగా పడుకున్నాడో.. కృష్ణుడిలా కృష్ణుడి ప్రేమ రాధకి దక్కకపోవచ్చు కానీ రాధ ప్రేమ కృష్ణుడికే అని అనుకుంటుంది.

లోహిత గదిలో చిన్ని ఫొటో చూసి ఇది వరుణ్‌ చూస్తే మధునే చిన్ని అని తెలిసిపోతుందని వరుణ్‌కి తెలీకుందా దాచేయాలి అనుకుంటుంది. వరుణ్‌ ఫొటో చూడాలి అనుకున్న టైంకి ఫొటో లోహిత లాక్కొని దాచేస్తుంది. వరుణ్ లోహితతో మ్యాడీ బావ లవ్‌కి మన ఫుల్ సపోర్ట్ ఉండాలి ఎంత రిస్క్ అయినా వాళ్లని ఒకటి చేయాలి అని చెప్తాడు. సరే అని లోహిత తలూపి మనసులో మాత్రం వాళ్లు ఎప్పటికీ కలవకూడదు అనుకుంటుంది. వరుణ్‌ లోహితను పడుకోమని చెప్తే లోహిత మనసులో నేను అనుకున్న లైఫ్ ఏంటి నేను బతుకుతున్న లైఫ్ ఏంటి.. అక్కడ వాళ్లు ఇంట్లోకి రానివ్వడం లేదు.. ఇక్కడ మధునే చిన్ని అని తెలిసిపోతుందనే టెన్షన్‌తో నిద్ర ఎలా పడుతుంది అనుకుంటుంది.

ఉదయం మధు బట్టలు ఉతుకుతుంది. అది చూసి వరుణ్‌ లోహితను పిలిచి మన బట్టలు కూడా మధు ఉతుకుతుంది. నువ్వు వెళ్లి ఉతుకు అని అంటాడు. నేనా అని లోహిత అంటే నువ్వే వెళ్లు అని వరుణ్ పంపుతాడు. లోహిత వెళ్లి మధుతో బట్టలు ఉతికించాలి అనుకుంటే మధు రివర్స్‌లో ఇవిగో లోహిత మీ బట్టలు నువ్వే ఉతుక్కో అని సబ్బు ఇస్తుంది. ఎవరి పనులు వాళ్లే చేసుకుంటే బెటర్ అని లోహితకు బట్టలు ఉతకమని అంటుంది. లోహిత ఉతకలేకపోవడంతో మధు లోహితకు నేర్పిస్తుంది. ఇద్దరూ బట్టలు ఉతుకుతారు. లోహిత ఉతికేసి చిరాకుగా ఆరేసి వెళ్లిపోతుంది.

మధు మ్యాడీ బట్టలు ఉతుకుతుంటే మ్యాడీ వచ్చి నువ్వు నా బట్టలు ఉతకడం ఏంటి అని అంటాడు. ఇక మ్యాడీ కూడా మధు పక్కనే కూర్చొని బట్టలు ఉతుకుతాడు. మ్యాడీ మధుతో ఈ లోకంలో నిన్ను పెళ్లి చేసుకునే వాడికంటే అదృష్టవంతుడు ఎవడూ ఉండడు అని అంటాడు. ఇక మధు అయితే ప్రపంచంలో అందరి కంటే అదృష్టవంతురాలు నిన్ను చేసుకునే భార్య అని అంటుంది. నువ్వు లక్కీ నేను లక్కీ అని మ్యాడీ అంటాడు. ఇక నాగవల్లి, దేవాని ఒప్పించి మ్యాడీవాళ్ల దగ్గరకు తీసుకెళ్తుంటుంది. ఇంతలో మ్యాడీ వంట వాడిగా పని చేయడం చూసి షాక్ అయి ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.