Chinni Serial Today Episode మ్యాడీ మధు వాళ్ల ఇంటికి వరుణ్, లోహితల్ని తీసుకొని వస్తాడు. మ్యాడీకి మధు గది చూపిస్తుంది. మ్యాడీ చిన్నతనంలో తనకు మధు ఇచ్చిన పెళ్లికూతురు బొమ్మని చూసి అక్కడే టేబుల్ మీద పెడతాడు. గది మొత్తం చూస్తాడు. ఇక మ్యాడీ డ్రస్‌తో ఇబ్బంది అవుతాడు. ఈ డ్రస్‌తో పడుకోవడం కష్టం అని అనుకుంటాడు.

మధుకి విషయం చెప్తాడు. మధు వాళ్ల నాన్నతో లుంగీ తీసుకురమ్మని చెప్తుంది. సుబ్బు లుంగీ, టీషర్ట్ ఇస్తాడు. మ్యాడీ తనకు వద్దని లుంగీ కట్టుకోనని అంటాడు. మధు లుంగీ ఎలా కట్టుకోవాలో చెప్తా అని చెప్తుంది. ఓ ఇంత ఈజీనా అని మ్యాడీ గదిలోకి వెళ్తాడు. టీ షర్ట్ వేసుకుంటాడు.. కానీ లుంగీ కట్టుకోలేకపోతాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదని అనుకుంటాడు. ఇక మధు బయట నుంచి అయిపోయిందా అని అడుగితే మధు కాదు అంటాడు. ఇక బయట నుంచి మధు చెప్తే లోపల మ్యాడీ కట్టుకుంటాడు. మ్యాడీ లుంగీ కట్టుకొని బయటకు వస్తే సూపర్ ఉన్నావ్ మ్యాడీ అని మధు అంటుంది. ఇక వంట చేస్తానని చెప్పి మధు వెళ్తుంది.

మ్యాడీ వెళ్తూ అక్కడే ఉన్న మధు బొమ్మలు చూస్తాడు. అందులో తల్లిబిడ్డల బొమ్మ చూసి మమ్మీ నువ్వు నా గురించి ఎంత బాధ పడుతుంటావో నాకు తెలుస్తుంది.. సారీ మమ్మీ అని అనుకుంటాడు. నాగవల్లి ఏడుస్తూ ఉంటుంది. భోజనం కూడా చేయదు.. ప్రమీల వచ్చి భోజనం చేయమని చెప్తుంది. నా కొడుకు బయట ఎన్ని బాధలు పడుతున్నాడో.. టైంకి తింటున్నాడో లేదో అని ఏడుస్తుంది. నన్ను బలవంతం పెట్టొద్దని అంటుంది. శ్రేయ, వసంత వస్తారు. శ్రేయ తినమని తినిపిస్తుంది. నాగవల్లి వద్దని అంటుంది. దేవా వచ్చి మ్యాడీ కళ్లలో కనీసం రిగ్రేట్ లేదు కూడా అని దేవా అంటే కన్నతల్లిని కదా బావ అని నాగవల్లి ఏడుస్తుంది.

దేవాకి రౌడీల నుంచి కాల్ వస్తుంది. బాలరాజు కళ్లు తిరిగి పడిపోయాడని చెప్తారు. దాంతో దేవా మనకి సంబంధించి హాస్పిటల్‌లో చేర్పించమని అంటాడు. నాగవల్లి విషయం తెలుసుకొని వాడిని చంపేయ్ బావ వాడు ఎందుకు అని అంటే నాకు వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయాలని ఉందికానీ చిన్నిని పట్టుకోవాలి అంటే వాడు ఉండాలి అని దేవా అంటాడు. ఇక మధు వాళ్ల ఇంట్లో అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేస్తారు. మధు వరుణ్, లోహిత, మ్యాడీలను పిలుస్తుంది.

స్వరూప అందరికి అన్నం వడ్డిస్తుంది. లోహిత కూర్చొడానికి ఇబ్బంది పడితే సుబ్బు సారీ చెప్పి అడ్జెస్ట్ అవ్వమని అంటాడు. లోహిత అడ్జెస్ట్ అవుతుందని వరుణ్ అంటాడు. లోహిత మనసులో ఎలా బతకాలి అనుకున్నా ఏ లైఫ్ వద్దు అనుకున్నానో అదే బతకాల్సి వస్తుందని అనుకుంటుంది. మధుకి లెగ్ పీస్ ఇష్టమని అంటే మ్యాడీ తన లెగ్ పీస్ ఇచ్చేస్తాడు. ఇక లోహిత తినకపోయే సరికి మా వంటలు నచ్చడం లేదా అని సుబ్బు అంటాడు. అలా ఏం లేదని లోహిత అంటుంది. మ్యాడీ పొలమారితే ఎవరో తలచుకుంటున్నారని మధు అంటే మా మమ్మీ అని మ్యాడీ అంటాడు. మ్యాడీ భోజనం చేసిన తర్వాత మధు మ్యాడీ ప్లేట్ తీసుకుంటుంది. ఇక వరుణ్ వరుణ్ ప్లేట్ లోహిత లోహిత ప్లేట్ పట్టుకొని బయటకు వస్తుంది. ఇక మధు బయట ప్లేట్ తోముతూ వరుణ్ దగ్గర ప్లేట్ లోహితను తీసుకోమని అంటుంది.

లోహితకు ఇద్దరి ప్లేట్స్ తోముకోమని చెప్తుంది. ఇదేం ఖర్మరా ఛీ యాక్ అని లోహిత అనుకుంటుంది. లోహిత నీకు తోమడం రాదా అని మధు నేర్పిస్తుంది. ఈ తన తల్లి దగ్గర వంటలు కూడా నేర్చుకోమని మధు చెప్తుంది. లోహిత ముఖం మాడ్చుకుంటుంది. బాలరాజుని అడ్మిట్ చేసిన హాస్పిటల్‌కి దేవా వెళ్తాడు. నా పగ కోసం అయినా వీడు బతకాలి అని అనుకుంటాడు. డాక్టర్ వచ్చి నీరసంగా ఉన్నాడు.. అన్ కాన్సియస్‌లో ఉన్నాడని చెప్తాడు. దేవా డాక్టర్‌తో వాడు బతకాలి అని అంటాడు. బాలరాజు దగ్గరకు వెళ్లి నిన్ను చంపడం నాకు ఒక్క క్షణం పనిరా కానీ నీ కళ్ల ముందే నీ కూతురిని చిత్ర హింసలు పెట్టి మీ ఇద్దరినీ కలిపి చంపుతానురా అని అంటాడు. దేవా మాటలకు బాలరాజుతో చలనం వచ్చి పిడికిలి బిగిస్తాడు. దగ్గరల్లో ఉన్న చాక్ తీసుకొని దేవా చేతి మీద పొడుస్తాడు. దాంతో దేవా ప్లేట్‌తో బాలరాజుని కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.