Chinni Serial Today Episode లోహిత ఏడుస్తూ తన తల్లి తన మీద బెంగ పెట్టుకొని తిండి నిద్ర మానేసిందని మందులు వేసుకోవడం లేదని మొసలి కన్నీరు కార్చుతుంది. మా ఇంట్లో నాకు పెళ్లి అయింది అని తెలిస్తే మా అమ్మ గుండె ఆగిపోతుంది. దేవేంద్ర వర్మ గారి మేనల్లుడిని పెళ్లి చేసుకున్నా అంటే వాళ్లు అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని తెలిస్తే తట్టుకోలేరు.. మనం మీ ఇంటికి వెళ్లేది ఎప్పుడు.. నేను వరుణ్‌ని నా భర్తగా మా ఇంటికి తీసుకెళ్లేది ఎప్పుడు అని ఏడుస్తుంది.

మ్యాడీ లోహితో ఇక ఈ విషయం గురించి బాధ పడొద్దు.. కరెక్ట్‌గా వారంలో మా డాడీని ఒప్పించి మీ ఇంటికి వెళ్తాను.. తర్వాత మీ ఇంటికి వెళ్లి మీ మమ్మీఅన్నయ్యకి విషయం నేను చెప్తా అని మ్యాడీ అంటాడు. లోహిత చాలా హ్యాపీ అయిపోతుంది. ఇక మ్యాడీ మధు కోసం చూస్తే మధు లేదు ఉదయం ఎక్కడికో వెళ్లింది అని అంటుంది స్వరూప. మధు ఎక్కడికి వెళ్లిందో అని ఇంట్లో చెప్పకుండా వెళ్లింది అంటే మాఇంటికి వెళ్లిందా అని మ్యాడీ అనుకొని మధుకి కాల్ చేస్తాడు. కాల్ కనెక్ట్ అవ్వదు. మ్యాడీ ఇంటికి వెళ్లాలి అని బయల్దేరుతాడు.

దేవా మధుని తీసుకొని రావడం చూసి నాగవల్లి వాళ్లు షాక్ అయిపోతారు. మధు భయంతో ఉంటే ఆంటీని చూసి భయపడుతున్నావా ఆంటీ ఏం అనదులేమ్మా బ్రేక్ ఫాస్ట్ చేద్దాం పద అని డైనింగ్ టేబుల్ మీద కూర్చొపెడతారు. దేవా శ్రేయ వాళ్లని పంపేస్తాడు. అది మనకు గెస్ట్ ఏంటి బావ అని దేవాని నాగవల్లి అడిగితే అటు నుంచి నరుక్కొని వస్తా అని చెప్పా కదా అందుకే ఇదంతా అని మ్యాడీ, మధులు థ్యాంక్స్ చెప్పడం గురించి చెప్తాడు. బ్రేక్ ఫాస్ట్ చేద్దాం పద అని దేవా నాగవల్లిని పిలిస్తే దాంతో కలిసి నేను తినడం ఏంటి అని వల్లీ వెళ్లిపోతుంది.

దేవా దగ్గరుండి మధుకి టిఫెన్ పెడతాడు. మీరు నాకు వడ్డించడం ఏంటి అంకుల్ అని మధు అంటే రేపు నేను మీ ఇంటికి వస్తే నువ్వు వడ్డించుదువులే అని దేవా అంటాడు. ఇక దేవా మధుతో ఏదో మాట్లాడాలి అన్నావ్ కదా ఏంటి అని అడుగుతాడు. కష్టంలో ఉన్న నన్ను ఆదుకున్నారు. ఇప్పుడు మ్యాడీ కూడా కష్టపడుతున్నాడు అని అంటుంది. వాడికి ఇప్పుడు ఏం కష్టం వచ్చిందమ్మా అని దేవా అంటే అమ్మానాన్నలు దగ్గర లేకపోవడం ఎవరికైనా కష్టమే కదా అంకుల్.. సంబంధం లేని నా కోసం ఆలోచించిన మీరు మ్యాడీ కోసం కూడా ఆలోచించొచ్చు కదా.. మీ కోసం తలచుకొని ప్రతీక్షణం బాధ పడుతున్నాడు అని అంటుంది.

మ్యాడీ ఇంత గొప్ప ఫ్యామిలీలో పెరిగి ఏ కంఫర్ట్ లేని మా ఇంట్లో ఉంటున్నాడు. తను అది కష్టం అని చెప్పడం లేదు కానీ అది ఎంత కష్టమో అని మాకు తెలుసు.. వరుణ్‌, లోహిలతో కలిసి ఈ ఇంటికి వస్తాను అని ఎందుకు అంటున్నాడు అంటే వరుణ్‌, లోహిలకు కూడా మీ ప్రేమ దక్కాలి అని ప్రయత్నిస్తున్నాడు అని అంటుంది. ఒకసారి మ్యాడీతో ప్రశాంతంగా మాట్లాడండి అని అంటుంది. దేవా సరే అని మాట్లాడుతా అని చెప్తుంది. మ్యాడీతో మాట్లాడుతా అన్నందుకు థ్యాంక్స్ అని మధు చెప్తుంది.

మధు, దేవాతో నవ్వుతూ మాట్లాడం చూసిన శ్రేయ ఫోటోలు తీసి మా ఇంట్లో మా మామయ్యతో నవ్వుతూ టిఫెన్ చేస్తావా ఇంటికి వెళ్లు నీకు మనస్శాంతి లేకుండా చేస్తా అని ఫోటోలు లోహితకు పెడుతుంది. లోహిత చూసి షాక్ అయిపోతుంది. వెంటనే లోహిత శ్రేయకి కాల్ చేసి మాట్లాడుతుంది. మా మామయ్య దాన్ని తీసుకొచ్చారని శ్రేయ చెప్పడంతో లోహి షాక్ అయిపోతుంది. అసలేం జరుగుతుంది శ్రేయ అని లోహి షాక్ అయిపోతుంది. మ్యాడీని ట్రాప్ చేయడానికి ఇదంతా చేస్తుంది.. అదే జరిగితే మన ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి అని లోహి శ్రేయని టెన్షన్ పెట్టేస్తుంది. శ్రేయ చాలా భయపడుతుంది. మధు మనకు అడ్డురాకుండా నేను చేస్తా అని లోహి అంటుంది.

మ్యాడీ మధుకి ఎదురెళ్లి ఎక్కడికి వెళ్లావ్ అని కోపంగా అడుగుతాడు. నేను మీ ఇంటికి వెళ్లా అని మధు చెప్పగానే మ్యాడీ మధుని కొట్టి నీకు చెప్తే అర్థం కాదా.. వాళ్లు ఒప్పుకోరు అని తెలిసి ఎందుకు వెళ్లావ్.. అని తిడతాడు. తర్వాత నీ మీద చేయి చేసుకున్నా సారీ మధు అని చెప్తాడు. ఏం తప్పు చేశావ్ అని సారీ చెప్తావ్ మ్యాడీ నువ్వు ఇలా కొట్టడం కరెక్ట్‌. నువ్వు వద్దు అన్నా మీ ఇంటికి వెళ్తే అక్కడ ఏంజరుగుతుందో అన్న టెన్షన్‌తో నువ్వు కొట్టావ్. మొన్న నేను నిన్ను తిట్టాను నువ్వు నన్ను కొట్టావ్.. మనకు తిట్టి కొట్టుకునే హక్కు వచ్చేసిందని అంటుంది. ఇక నీకు ఒక గుడ్‌ న్యూస్ అని దేవాతో మాట్లాడానని మీ నాన్న ప్రేమగా నాతో మాట్లాడారు అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.