Indrans's Chinna Chinna Aasai OTT Release Date Locked : మలయాళ మూవీస్‌కు తెలుగులోనూ సూపర్ క్రేజ్ ఉంది. రీసెంట్‌గా మలయాళంలో రిలీజై సూపర్ రెస్పాన్స్ అందుకున్న మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. మలయాళ నటుడు ఇంద్రన్స్, రోజా ఫేం మధుబాల ప్రదాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా 'చిన్న చిన్న ఆశై' ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్‌లో (Jio Hotstar) ఈ నెల 28 (మంగళవారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. 'ప్రతీ చిన్న కోరిక వెనుక చెప్పుకోదగ్గ ఓ కథ ఉంటుంది.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీకి వర్షా వాసుదేవ్ దర్శకత్వం వహించారు. ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ.

ఇంద్రన్స్, మధుబాలలతో పాటు అపర్ణ బాలమురళి, తంబి రామయ్య, కాళీ వెంకట్, విష్ణు అగస్త్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.

Also Read : Ram Charan : రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?