China is building vast new Great Wall and it will power Beijing: ఎవరూ ఊహించని అత్యంత భారీ ప్రాజెక్టులు చేపట్టడంలో చైనా చాలా ముందు ఉంటుంది.
తాజాగా ఓ గ్రేట్ వాల్ ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఉన్న గ్రేట్ వాల్ కాదు. సోలార్ గ్రేటర్ వాల్. చైనా రాజధాని బీజింగ్ కు పవర్ అందించేందుకు దీన్ని ప్లాన్ చేసి శరవేగంగా నిర్మిస్తున్నారు. నాలుగు వందల కిలోమీటర్ల పొడుగు .. ఐదు కిలోమీటర్ల వెడల్పులో సోలార్ గ్రేట్ వాల్ ఉండటం ప్రత్యేకత. ఈ సోలార్ వాల్ వల్ల వంద గిగావాట్ల విద్యుత్ లభిస్తుంది. ఇప్పటికే చివరి దశకు వచ్చిన ఈ వాల్ నుంచి విద్యుత్ ఉత్పత్తి 2030కి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

చైనా రాజధాని బీజీంగ్ కు నిరంతర విద్యుత్ ను సరఫరా చేయడానికి సోలార్ గోడ నిర్మించాలనే ప్రతిపాదన చాలా ఏళ్ల క్రితమే చేసి అమలు చేయడం ప్రారంభించారు.ఈ గ్రేట్ సోలార్ వార్ ఇన్నర్ మంగోలియాలోని కుబుకి ఎడారిలో ఉంది. దీన్ని ఒకప్పుడు "మృత్యు సముద్రం"గా పిలిచేవారు. ఇక్కడ నీరు ఉండదు.. పూర్తిగా ఎడారిగా మారిపోయిన ప్రాంతం. చైనా నిర్మిస్తున్నఈ సోలార్ గ్రేట్ వాల్ అసాధారణం అయిందని.. నారా NASA ఎర్త్ అబ్జర్వేటరీ గుర్తించింది. కుబుకి ఎడారిలో ఎండ వాతావరణం, చదునైన భూభాగం, పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో ఉండటం వల్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ఇది ఒక కావాల్సిన అనువైన ప్రదేశంగా మారింది.

యెల్లో నదికి దక్షిణంగా ఉన్న పొడవైన, ఇరుకైన దిబ్బల బ్యాండ్‌లో ప్యానెల్‌లను ఏర్పాటు చేస్తున్నట్లుగా గుర్తిచారు. చైనాలో ఇప్పటికే అతి పెద్ద సోలార్ పవర్ స్టేషన్ ఉంది. జున్మా సోలార్ పవర్ స్టేషన్ 2019లో పూర్తయింది, సౌర ఫలకాలతో గుర్రం బొమ్మను చిత్రీకరించారు. ఇది అతి పెద్ద చిత్రంగా గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది.ఈ సోలార్ స్టేషన్ ప్రతి సంవత్సరం సుమారు 2 బిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇది నాలుగు లక్షల కుటుంబాల విద్యుత్ అవసరాలు తీరుస్తోంది. జున్మా అంటే మాండరిన్‌లో “మంచి గుర్రం” అని అర్థం. అందుకే ఆ బొమ్మ సౌరఫలకల మీద వచ్చేలా చేశారు.

ఈ సోలార్ ప్యానెల్ వార్ నిర్మాణం భిన్నంగా ఉంటుంది. ఐదు కిలోమీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నందున ఎత్తుగా నిర్మిస్తున్నారు. దీని వల్ల కింద వ్యవసాయం చేయడానికి పంటలు పండించడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. జూన్ 2024 నాటికి, చైనా 386,875 మెగావాట్లతో సౌర విద్యుత్ రంగంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది. ఇది ప్రపంచ మొత్తంలో 51 శాతం సోలార్ పవర్ తో సమానం. బీజింగ్ కు విద్యుత్ అందించేందుకు నిర్మిస్తున్న సోలార్ గ్రేట్ వాల్ పూర్తి అయితే చైనా సోలార్ పవర్ లో మరింత ముందడుగు వేస్తోంది.

Also Read: సిజేరియన్లకు పరుగులు పెడుతున్న ప్రెగ్నెంట్ మహిళలు - పిల్లలకు పౌరసత్వం కోసం అమెరికాలో కొత్త హడావుడి !