Chennai Love Story Jigithara Song Telugu Lyrics : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన లవ్ ఎంటర్టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ'. ఈ మూవీ నుంచి మరో క్యూట్ లవ్ సాంగ్ 'జిగితార' రిలీజ్ చేశారు. మ్యూజిక్ లెజెండ్ మణిశర్మ మరోసారి మ్యాజిక్ చేశారు. ఫస్ట్ సాంగ్ 'వదలనే నిను వదలనే...' ట్రెండ్ అవుతుండగా... తాజాగా సాంగ్ కూడా వైరల్ అవుతోంది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా... కార్తిక్ పాడారు.

జిగితార సాంగ్ క్యూట్ లిరిక్స్

పల్లవి

జిగితార జిగితార... దిగినావా మనసారా...

ఆకశాన్ని వీడి ఈ ఆకతాయికై...

భూమి చేరినావు నా మౌన దేవతై...

బతకాలనున్నదే ఇక నీకు బానిసై...

ప్రతి రోజూ నీకిలా సేవ చేయడానికై...

జిగితార జిగితార... దిగినావా అరె మనసారా...

చరణం 1

బావిలో ఈదే జీవిలా ఉండగా...

పువ్వులా తావిలో ముంచి తేల్చావుగా...

రేవులే లేని నావలే నవ్వగా...

తోవలో దీవిలా నన్ను చేరావుగా...

పగలైనా చీకటే నా నిన్నకీ...

నడిరేయి వేకువే ఈ నేటికీ...

హరివిల్లువైతివీ నల్ల కాగితానికీ...

జిగితార జిగి జిగితార... దిగినావా అరె మనసారా...

చరణం 2

రాత్రిలో రాజ పాటనై మోగుతా...

తీయని లాలిలో హాయిగా సోలిపో...

భారతీరాజా చిత్రమై చేరుతా...

రంగున మాయలో రోజునే మర్చిపో...

వడివేలై అందుతా నీ వేలుకీ...

సరదాగా నవ్వుకో ఈ వేళకి...

సినిమాని మించిన జీవితాన్ని చూపుతా...

నిలవేణి నిలవేణీ అడగానా ఇన్ములియేనీ..

నీకు ఏది వేణుమో ఆర్డరేసుకో...

నీకు ఎంత పోదుమో అంత వాడుకో...

కథలన్నీ కంచికే అని అందరందురే...

కామాక్షి ముందరే స్టార్టయింది నా కథే...

Also Read : Kiran Abbavaram : మొన్న క, నిన్న కె ర్యాంప్, నేడు చెన్నై లవ్ స్టోరీ - వరుస హిట్స్ కొడుతున్నామన్న కిరణ్ అబ్బవరం

ఈ మూవీలో రవి నంబూరి దర్శకత్వం వహించగా... బేబీ ఫేం సాయి రాజేష్ స్టోరీ అందించారు. SKN నిర్మాతగా వ్యవహరిస్తుండగా... సాయి రాజేష్ సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మణిశర్మ మ్యూజిక్ అందించారు. జులై 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Maa Inti Bangaram Collections : మా ఇంటి బంగారం రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేను మించిన నెంబర్స్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.