Top 5 Most Affordable Bikes In India 2025: భారతీయ టూ-వీలర్‌ మార్కెట్‌ అంటే... తక్కువ ధరలో నమ్మకమైన వాహనం కావాలని కోరుకునే సాధారణ ప్రజల ఆలోచనలకు అద్దం పట్టే ప్రదేశం. ఇక్కడ కేవలం ధర మాత్రమే కాదు... మైలేజ్‌, రిపేర్‌ సౌలభ్యం, లాంగ్‌ లైఫ్‌ అన్నీ సమానంగా ముఖ్యం. ఇంతకుముందు ఈ సెగ్మెంట్‌లో Hero Splender రాజ్యమే నడిచింది. కానీ ఇప్పుడు, GST 2.0 అమలు తర్వాత కొత్త బైక్స్‌ మరింత తక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చాయి.

ప్రస్తుతం, దేశంలో దొరుకుతున్న అత్యంత చవకైన ఐదు బైక్స్‌ ఇవీ:

1. TVS Sport ES - ₹64,500 (తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌-షోరూమ్‌ ధర)

ఇప్పుడు భారతదేశంలో దొరుకుతున్న అత్యంత చవకైన బైకుల్లో ఇది ఒకటి. ‘ES’ అంటే ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌ అనే అర్థం. 109.7cc ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ ఇంజిన్‌తో ఇది 8.3hp పవర్‌, 8.7Nm టార్క్‌ ఇస్తుంది. బడ్జెట్‌ బైక్‌ అయినా స్టార్ట్‌ ఫీచర్‌, మెరుగైన మైలేజ్‌తో రోజువారీ ప్రయాణాల కోసం బెస్ట్‌ ఆప్షన్‌గా నిలుస్తోంది.

2. Hero HF Deluxe (All Black) - ₹66,597 (తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌-షోరూమ్‌ ధర)

HF Deluxe అంటే బడ్జెట్‌ సెగ్మెంట్‌లో హీరోకు ఉన్న బలమైన ప్లేయర్‌. Hero HF 100 ఇంజిన్‌ తోనే, ఆల్‌-బ్లాక్‌ ఎడిషన్‌ రూపంలో కొత్తగా వచ్చింది. ఈ వేరియంట్‌ ధర GST 2.0 తర్వాత దాదాపు ₹5,000 తగ్గి, ఇప్పుడు సుమారు ₹66,597 కు లభిస్తోంది. 97.2cc ఇంజిన్‌, 4-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఈ క్లాస్‌లో సరైన కాంబినేషన్‌.

3. Hero HF 100 - ₹60,489 (తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌-షోరూమ్‌ ధర)

ఇది హీరో కుటుంబంలో అత్యంత ప్రజాదరణ పొందిన చవకైన బైక్‌. 97.2cc ఇంజిన్‌ నుంచి 7.9hp పవర్‌, 8.05Nm టార్క్‌ ఇస్తుంది. హీరో స్ప్లెండర్‌ లాంటి మైలేజ్‌ కలిగి ఉండే ఈ బైక్‌ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ₹60,489 ఎక్స్‌-షోరూమ్‌ ధరకు అందుబాటులో ఉంది.

4. Honda Shine 100 - ₹64,749 (తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌-షోరూమ్‌ ధర)

హోండా షైన్‌ 100 ఈ కంపెనీ లైన్‌ప్‌లో చవకైన బైక్‌. 98.98cc ఇంజిన్‌ ద్వారా 7.38hp పవర్‌, 8.04Nm టార్క్‌ ఇస్తుంది. సాఫ్ట్‌ రైడ్‌, స్మూత్‌ గేర్‌ షిఫ్ట్‌ & ఆకర్షణీయమైన డిజైన్‌తో ఇది అర్బన్‌ కమ్యూటర్లకు (డైలీ వాడేవాళ్లకు) సరైన ఎంపిక. ఇటీవల హోండా Shine 100 DX వెర్షన్‌ను కూడా విడుదల చేసింది, మరికొంచెం స్టైలిష్‌ బైక్‌ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్‌.

5. Bajaj Platina 100 - ₹65,436 (తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌-షోరూమ్‌ ధర)

బజాజ్‌ కుటుంబంలో అతి పాత, విశ్వసనీయమైన బైక్‌లలో ప్లాటినా ఒకటి. 102cc ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్‌తో 7.9hp పవర్‌, 8.3Nm టార్క్‌ ఇస్తుంది. గేర్‌ మార్చడంలో సౌలభ్యం, కంఫర్ట్‌బుల్‌ సీటింగ్‌, మైలేజ్‌ - ఇవన్నీ ప్లాటినా ప్రత్యేకతలు.

ఇప్పుడు కేవలం ₹60,489 నుంచి ₹66,597 రేంజ్‌లోనే మంచి మైలేజ్‌ బైక్స్‌ లభిస్తున్నాయి. రోజూ ఆఫీస్‌ ప్రయాణం, చిన్న పట్టణాల మధ్య ట్రిప్స్‌, ఫ్యూయల్‌ సేవింగ్‌, తక్కువ రిపేర్‌ ఖర్చులు వంటి అవసరాలన్నింటినీ తీర్చగల ఈ బైక్స్‌ నిజంగా “కామన్‌ మ్యాన్‌ పాలిట హీరోలు”.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.