Cheap Cars In India Expensive In Pakistan Price Comparison: పాకిస్థాన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఇండియన్‌ & జపనీస్ కార్లకు అత్యంత డిమాండ్ ఉంది. ముఖ్యంగా, కాంపాక్ట్ కార్లు & సెమీ-లగ్జరీ మోడల్స్ అక్కడ బాగా అమ్ముడుపోతున్నాయి, కస్టమర్లు ఎగబడి కొంటున్నారు. అందుబాటు ధరలు, నమ్మకమైన పనితీరు & అద్భుతమైన మైలేజ్ కారణంగా ఈ కార్లు ప్రజాదరణ పొందాయి.

పాకిస్థాన్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు-రేట్లు:

Suzuki Alto
సుజుకి ఆల్టో పాకిస్థాన్‌లో బాగా పాపులర్‌ కారు. దీని కాంపాక్ట్ డిజైన్ & అద్భుతమైన మైలేజ్‌ కారణంగా కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందింది. పాకిస్థాన్‌లో విక్రయించే ఆల్టో మోడల్... డిజైన్ & లక్షణాలలో ఇండియన్ ఆల్టో కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ దీని ధర 29.94 లక్షల పాకిస్థానీ రూపాయలు. భారత్‌లో, మారుతి సుజుకీ ఆల్టో K10 రేటు రూ. 3.70 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Suzuki Swift
సుజుకి స్విఫ్ట్ ఇటు భారతదేశంలో & అటు పాకిస్థాన్‌లోనూ చాలా కాలంగా కస్టమర్ల అభిమాన కారుగా నిలిచింది. స్టైలిష్ లుక్స్, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్ & మృదువైన పనితీరు ఈ కారుకు ఉన్న అతి పెద్ద బలాలు. స్విఫ్ట్ డిమాండ్‌ పాకిస్థాన్‌లో నిరంతరం కొనసాగుతోంది. అక్కడ దీని ధర 44.6 లక్షల పాకిస్థానీ రూపాయలు. భారత్‌లో, మారుతి సుజుకీ ఆల్టో K10 రేటు రూ. 5.79 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Suzuki Bolan
పాకిస్థాన్‌లో మూడో స్థానంలో సుజుకి బోలాన్ ఉంది, దీనిని చిన్న కుటుంబాలు & వ్యాపార అవసరాల కోసం విస్తృతంగా కొనుగోలు చేస్తారు. ఇది, మన దేశంలో విక్రయించే Maruti Suzuki Omni ని పోలి ఉంటుంది. పాకిస్థాన్‌లో దీనిని దృఢమైన & నమ్మదగినది వెహికల్‌గా పరిగణిస్తారు. దీని ధర అక్కడ 22 లక్షల పాకిస్థానీ రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. మన దేశంలో, Maruti Suzuki Omni ని ఇప్పుడు అమ్మడం లేదు.

Toyota Corolla
టయోటా కరోల్లా పాకిస్థాన్‌లో అత్యంత విశ్వసనీయమైన సెడాన్‌గా చాలా కాలంగా డిమాండ్‌లో ఉంది. దీని దృఢమైన డిజైన్, సౌకర్యవంతమైన ప్రయాణం & తక్కువ నిర్వహణ ఖర్చులు దీనిని పాకిస్థానీయుల ఫేవరేట్‌ ఆప్షన్‌గా మార్చాయి. దీని ధర 61.19 లక్షల పాకిస్థానీ రూపాయలు. ఈ కారును కూడా ఇప్పుడు మన దేశంలో అమ్మడం లేదు.

Honda City
ఐదో స్థానంలో ఉన్న హోండా సిటీని యువత & ఉద్యోగులు, వృత్తి నిపుణులు ప్రత్యేకంగా కొంటారు. దీని స్టైలిష్ డిజైన్ & ప్రీమియం ఫీచర్లు మిగిలిన కార్ల కంటే దీనిని ప్రత్యేకంగా నిలబెడతాయి. పాకిస్థాన్‌లో దీని ధర 47.37 లక్షల రూపాయలు. భారత్‌లో, హోండా సిటీ రేటు రూ. 11.95 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

పాకిస్థాన్‌లో, చిన్న పట్టణాలు & మధ్య తరగతి బడ్జెట్ కస్టమర్లలో సుజుకి కార్లు బాగా ప్రాచుర్యం పొందాయి. టయోటా కరోలా & హోండా సిటీ వంటి కార్లు లగ్జరీ & సేఫ్టీ ఫీచర్లను కోరుకునే కస్టమర్లలో డిమాండ్‌లో ఉన్నాయి.