Planning Char Dham Yatra 2026 : చార్ ధామ్ యాత్ర 2026 ఈ సంవత్సరం ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. కాబట్టి తీర్థయాత్రకు వెళ్లే ముందు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అవసరమైన మార్గదర్శకాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ పవిత్ర తీర్థయాత్ర అక్షయ తృతీయ శుభ సందర్భంతో సమానంగా వస్తుంది. చార్ ధామ్ తీర్థయాత్రను హిందువులు భక్తి శ్రద్ధలతో చేయాలనుకుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది అక్కడికి వెళ్తారు.

చార్ ధామ్ తీర్థయాత్ర రిజిస్ట్రేషన్

ఈ తీర్థయాత్ర నాలుగు పవిత్ర తీర్థయాత్రలను కలిగి ఉంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్. చార్‌ధామ్ యాత్రకు వెళ్లే ముందు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని గుర్తించుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నమోదిత యాత్రికులను ట్రాక్ చేయడానికి GPS-ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తుంది. యాత్రికుల భద్రతను నిర్ధారించడానికి, ప్రతి తీర్థయాత్ర స్థలానికి సందర్శకుల సంఖ్యను నియంత్రించడంలో సహాయపడేందుకు ఇది హెల్ప్ చేస్తుంది.

అదనంగా చార్ ధామ్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఆహారం, బసతో సహా.. ప్రభుత్వం అందించే ప్రత్యేక సౌకర్యాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ కార్డ్ ట్రావెల్ ఇ-పాస్ కార్డ్‌గా పనిచేస్తుంది. మరి ఈ చార్‌ధామ్ యాత్రకు ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలిలో ఇప్పుడు చూసేద్దాం.

చార్‌ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్

చార్‌ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం registrationandtouristcare.uk.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

దీని తరువాత వ్యక్తిగత, ప్రయాణ సంబంధిత సమాచారాన్ని ఫిల్ చేయండి.

చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్ అప్‌లోడ్ చేయండి.

OTP ధృవీకరణను పూర్తి చేయండి.

మీ చార్‌ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను QR కోడ్‌తో పాటు డౌన్‌లోడ్ చేసుకోండి.

వాట్సాప్‌లో ఎలా నమోదు చేసుకోవాలంటే..

ఇప్పుడు చార్‌ధామ్ యాత్రికులు WhatsApp ద్వారా కూడా చార్‌ధామ్ యాత్రకు నమోదు చేసుకోవచ్చు.
మీరు చేయాల్సిందల్లా మీ ప్రయాణ సమాచారాన్ని టైప్ చేసి 8394833833 కు వాట్సాప్ ద్వారా పంపండి. ఆ తర్వాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని అడుగుతారు. చార్ ధామ్ తీర్థయాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ యాప్ ద్వారా పూర్తవుతుంది.

టోల్ ఫ్రీ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్

చార్‌ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం మీరు టోల్-ఫ్రీ నంబర్‌ను ఉపయోగించవచ్చు. మీరు టోల్-ఫ్రీ నంబర్ 01351364 కు కాల్ చేయాలి. దీనికి చేస్తే.. ఓ ప్రతినిధి ప్రయాణంలో మార్గదర్శకత్వం అందించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడంలో మీకు సహాయం చేస్తారు.

ఓవర్ ది కౌంటర్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్

ఆన్‌లైన్‌లో లేదా టోల్ ఫ్రీ మార్గాల ద్వారా నమోదు చేసుకోలేని వారికి.. హరిద్వార్, రిషికేశ్, బార్కోట్, హీనా, సోన్‌ప్రయాగ్, పాండుకేశ్వర్‌లకు వెళ్లే మార్గంలో ఆఫ్‌లైన్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించిన వివరాలు కింద ఉన్నాయి.

చార్‌ధామ్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్

హరిద్వార్‌లోని రాహి హోటల్‌లో

రిషికేశ్‌లోని ISBT

రిషికేశ్‌లో RTO

రిషికేశ్ లోని గురుద్వారా

ఇతర కౌంటర్లు

బార్కోట్ (యమునోత్రి)

హీన (గంగోత్రి)

సోన్‌ప్రయాగ్ (కేదార్‌నాథ్)

పదుంకేశ్వర్ (బద్రీనాథ్)

గోవింద్ ఘాట్ (హేమకుంట్ సాహిబ్)

మీరు ఆఫ్‌లైన్ మాధ్యమం ద్వారా చార్‌ధామ్ యాత్రకు నమోదు చేసుకోవాలనుకుంటే, మీరు ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్లకు వెళ్లాలి.

చార్‌ధామ్ యాత్రకు ముఖ్యమైన మార్గదర్శకాలు

ప్రైవేట్ లేదా వాణిజ్య వాహనాలు ఉత్తరాఖండ్ రవాణా శాఖ జారీ చేసిన గ్రీన్, ట్రిప్ కార్డును తప్పనిసరిగా పొందాలి. మీరు ఈ కార్డును greencard.uk.gov.in వెబ్‌సైట్‌లో కనుగొనవచ్చు. చార్‌ధామ్ యాత్రలో పాల్గొనే యాత్రికులందరికీ ఎత్తైన ప్రదేశాలలో వైద్య పరీక్షల కోసం ఆరోగ్య సలహా ఇవ్వడం అవసరం.