Chandra Grahan 2025: రాజకీయ, ఆరోగ్య, ఆర్థిక సంక్షోభ సూచనలు! చంద్రగ్రహణం ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుంది?

3 months ago 3
ARTICLE AD

Chandra Grahan Time Efect 2025:   సెప్టెంబర్ 7, 2025, ఆదివారం రాత్రి  దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై 3 గంటల 29 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం, చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రుడు తన నీడలోకి వెళ్ళిపోతాడు. ఈ సమయంలో చంద్రుని రంగు ఎరుపు రంగులోకి మారుతుంది, దీనిని సాధారణ భాషలో "బ్లడ్ మూన్" అని పిలుస్తారు. ఈసారి చంద్ర గ్రహణం కుంభ రాశి, పూర్వభాద్ర  నక్షత్రంలో ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనేక ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది.

శాస్త్రీయంగా ఇది కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే, కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  ఈ గ్రహణం రాబోయే రోజుల్లో రాజకీయ , సామాజిక పరిస్థితులను ప్రభావితం చేస్తుంది.

ఏ రాష్ట్రాలు, దేశాలపై ప్రభావం

జ్యోతిష్యం ప్రకారం ఈ గ్రహణం ముఖ్యంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బెంగాల్, మహారాష్ట్రలో ప్రభావం చూపుతుంది. ఈ ప్రాంతాల్లో రాజకీయ, సామాజిక అస్థిరత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో, కొన్ని ముస్లిం దేశాలలో యుద్ధ పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు.

వ్యవసాయం , పశుపోషణ

ఈ సారి గ్రహణం రైతులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పంట ఉత్పత్తిలో సాధారణం కంటే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. అయితే, పశువులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది . గ్రహణం ఆదివారం నాడు ఏర్పడుతోంది కాబట్టి పాలు , పాల ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

కళలపై ప్రభావం

గ్రహణం ధృతి యోగంలో ఏర్పడుతోంది, ఇది కళ  సంస్కృతికి సంబంధించిన వ్యక్తులకు కష్టాలను తెస్తుంది. సినిమా పరిశ్రమ   కళాకారులు పనిలో ఆటంకాలు, విమర్శలు  ఆర్థిక ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.

రాజకీయాలు,  ప్రభుత్వం

రాజకీయ కోణం నుంచి చూస్తే రాబోయే ఒకటిన్నర నెల గందరగోళంగా ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రధాని నరేంద్ర మోదీకి ఇది పోరాట సమయం అవుతుంది. ప్రతిపక్షం కొంతకాలం పాటు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ప్రభుత్వం కొన్ని కొత్త విధానాలను అమలు చేయవచ్చు, ఇవి ప్రజలకు ఉపయోగపడతాయి, కానీ వాటి వాస్తవ ప్రయోజనం పరిమితంగా ఉంటుంది.

ఆరోగ్యం,  ప్రజా జీవితం

గ్రహణం సమయంలో కుంభ రాశిలో చంద్రుడు-రాహువు ...  సింహ రాశిలో సూర్యుడు-బుధుడు-కేతువుల కలయిక ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రజలలో సీజనల్ వ్యాధులు,  అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి.

భారతదేశ జాతకం ప్రకారం..స్వాతంత్ర్యం వచ్చిన సమయం (ఆగస్టు 15, 1947, రాత్రి 12:00 గంటలకు, ఢిల్లీ) ఆధారంగా..ఢిల్లీలో వృషభ లగ్నం అయితే, ఈ గ్రహణం 11వ స్థానంలో ఉంటుంది. ఈ స్థానం పార్లమెంటు, కూటమి , పెద్ద సంస్థలకు సంబంధించినది. అంటే ప్రభుత్వంలో విభేదాలు, ప్రతిపక్షం ఆధిపత్యం , విధానపరమైన వివాదాలు పెరగవచ్చు, దేశం అకస్మాత్తుగా ఆరోగ్య సంబంధిత సంక్షోభాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

ఈ రాశుల వారికి అశుభ ప్రభావం

సింహ రాశి (Leo): ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అధికారులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం క్షీణించడం , ఖర్చులు పెరగడం.

కుంభ రాశి (Aquarius): చంద్రుడు-రాహువు కలయిక నేరుగా ఈ రాశిపై ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడి, వైఫల్యం , ఆరోగ్య సంబంధిత సమస్యలు. పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.

మిథున రాశి (Gemini): ధన నష్టం, కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలలో  ఆటంకాలు , ఆరోగ్యంపై ప్రభావం.

కన్యా రాశి (Virgo): పని రంగంలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రభుత్వ పథకాలలో ఆలస్యం. జీర్ణ సంబంధిత వ్యాధులు,  మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది.

ఈ చంద్ర గ్రహణం ఒక వైపు రైతులకు కొంత ప్రయోజనం చేకూరుస్తుండగా.. పశుపోషణ, రాజకీయాలు ,  కళా ప్రపంచానికి సవాలుగా ఉంటుంది. సింహ, కుంభ, మిథున మరియు కన్య రాశి జాతకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

Read Entire Article