Champions Trophy News: టీమిండియా తుదిజట్లులో కీలక మార్పులు.. పంత్ కు నిరాశేనా..? జడేజాకు చోటు డౌటే..!

10 months ago 8
ARTICLE AD

BCCI News: బీసీసీఐ తాజాగా ప్రకటించిన ఐసీసీ చాంపియన్షిప్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఇందులో కొన్ని అనూహ్య నిర్ణయాలు ఉన్నాయి. తెలుగు పేసర్ మహ్మద్ సిరాజ్ ను జట్టు నుంచి తప్పించారు. అలాగే గాయం గురించి అవగాహన రాక ముందే స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రాను జట్టులోకి ఎంపిక చేశారు. అయినా ఫిబ్రవరి 13 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశముండటంతో భారత స్క్వాడ్ పై మరోసారి స్పష్టత అప్పుడు వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.  మరోవైపు కేఎల్ రాహుల్ ను వన్డేల్లో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా ఎంపిక చేశారు. దీంతో రిషభ్ పంత్ అతనికి సబ్ స్టిట్యూట్ గా వ్యవహరించానున్నాడు. మిడిలార్డర్ లో ఐదో నెంబర్లో రాహుల్ బ్యాటింగ చేయనున్నాడు. ఇక దేశవాళీల్లో టన్నుల కొద్దీ పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్ ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. తాజాగా జరుగుతున్న విజయ్ హాజరే వన్డే ట్రోఫీలో తను 752 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. అయినా కూడా అతడిని పరిగణనలోకి తీసుకోలేదు.

ఓపెనర్ గా శుభమాన్ గిల్..
వన్డేల్లో రోహిత్ శర్మతోపాటు శుభమాన్ గిల్ ఓపెనింగ్ చేయడం ఖాయమైంది. దీంతో పాటు అతనికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. భవిష్యత్తును ఫోకస్ లో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను నాలుగో స్పిన్నర్ గా జట్టులోకి తీసుకున్నారు. కులదీప్ యాదవ స్పెషలిస్టు స్పిన్నర్ గా బరిలోకి దిగుతుండగా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లతోపాటు జడేజాను కూడా స్పిన్ ఆల్ రౌండర్ కోటాలో జట్టులోకి తీసుకున్నారు. ఇక మహ్మద్ షమీ వన్డేలలోకి పునరాగమనం చేశాడు. సొంతగడ్డపై 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఏడాదే తను అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు.

స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చినట్లు కాదు..
ఇటీవల బీసీసీఐ రూపొందించిన పది పాయింట్ల మార్గదర్శకాలపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించాడు. భారత జట్టు అంటే స్కూల్ కాదని, ఇప్పుడీ మార్గదర్శకాలు పనిష్మెంట్లు కావాని ఉద్ఘాటించాడు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు జట్టుగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, ఈక్రమంలోనే బోర్డు మార్గదర్శకాలు ఏర్పాటు చేసిందని తెలిపాడు. ఈ గైడ్ లైన్లు ఇప్పుడే కొత్తగా ఏర్పాటు చేయలేదని గతంలోనూ ఉండేవని తెలిపాడు. టీమిండియాలో సూపర్ స్టార్లు ఉన్నారని, వారికి అన్నీ తెలుసని, మార్గదర్శకాల గురించి అవగాహన ఉందని వ్యాఖ్యానించాడు. గత కొన్నేళ్లుగా ఈ మార్పుల గురించి చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడు కార్యరూపంలోకి వచ్చిందని పేర్కొన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో తన మ్యాచ్ లను దుబాయ్ లో భారత్ ఆడుతుంది. వచ్చేనెల 20న బంగ్లాదేశ్ తో, 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో, మార్చి 2 న న్యూజిలాండ్ తో లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది.

Also Read: ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన

Read Entire Article