<p>హైదరాబాద్: మహిళా యూనివర్సిటీకి వీరనారి చిట్యాల ఐలమ్మ(చాకలి ఐలమ్మ) పేరు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ శాసన మండలిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ యూనివర్సిటీ పేరు మార్పుపై బిల్లు ప్రవేశ పెట్టారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరును మహిళా యూనివర్సిటీకి పెట్టడం ఆనందంగా ఉందన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. ఆమె చేసిన పోరాటం ఎంతోమంది మహిళలకు స్పూర్తి అని, అందుకే ఆమె ధైర్య సాహసాలు స్మరించుకునేందుకు మహిళా యూనివర్సిటీకి చాకల ఐలమ్మ పేరు పెట్టామని మంత్రి పేర్కొన్నారు.</p>