Castor Oil Hair Benefits : ఆముదం నూనెను చాలా ఏళ్లుగా హెయిర్ కేర్‌ రొటీన్లో ఉపయోగిస్తున్నారు. ఇది కాస్త చిక్కగా, జిగురుగా ఉండటంతో నేరుగా జుట్టుకు రాయడాన్ని కొందరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకే కాస్టర్ ఆయిల్‌లో కొబ్బరి నూనె, అలోవెరా, ఉల్లిపాయ నూనె, రోజ్‌మేరీ, కరివేపాకు వంటి పదార్థాలను కలిపి ఉపయోగించే పద్ధతులు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. మరి వీటిని కలపడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

ఆముదంతో కొబ్బరి నూనె

ఆముదంతో కలపడానికి సులభమైన పదార్థాల్లో కొబ్బరి నూనె ఒకటి. ఆముదం చాలా చిక్కగా ఉంటుంది. కొబ్బరి నూనె తేలికగా ఉండటంతో రెండింటినీ కలిపితే స్కాల్ప్‌పై అప్లై చేయడం ఈజీ. పైగా జుట్టంతా సమానంగా పట్టించడం సులభమవుతుంది. కొబ్బరి నూనె జుట్టును కండిషన్ చేయడంలో, పొడిబారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో జుట్టు రాలడం తగ్గవచ్చు.

Also Read : మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి

ఒక టేబుల్ స్పూన్ ఆముదంలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలపండి. మిశ్రమాన్ని చేతుల మధ్య కొద్దిగా రుద్ది గోరువెచ్చగా చేసుకోవచ్చు. నేరుగా గోరువెచ్చగా వేడి చేసి స్కాల్ప్‌కు మసాజ్ చేయవచ్చు. మిగిలిన నూనెను జుట్టు పొడవునా అప్లై చేయండి. 30 నిమిషాల నుంచి గంట వరకు ఉంచి తర్వాత తేలికపాటి షాంపూతో కడగవచ్చు. ఈ మిశ్రమం జుట్టు పొడిబారడాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. జుట్టుకు తేమ అందించి సాఫ్ట్‌గా మార్చుతుంది. కొబ్బరి నూనె జుట్టు షాఫ్ట్‌లోకి చొచ్చుకుపోయి ప్రోటీన్ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు.

ఆముదంలో అలోవెరా

అలోవెరా జెల్‌ నూనెలకు భిన్నంగా నీటి ఆధారితమైనది. ఇది తేలికగా, చల్లగా అనిపిస్తుంది. పొడిబారిన లేదా ఇరిటేషన్‌కు గురైన స్కాల్ప్‌ను తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. దీనిలో ఆముదం కలిపి అప్లై చేస్తే కలిగే బెనిఫిట్స్ చూసేద్దాం. ఒక టేబుల్ స్పూన్ ఆముదంలో ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన అలోవెరా జెల్ కలపండి. మిశ్రమం మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్రధానంగా స్కాల్ప్‌, జుట్టు మూలాలకు అప్లై చేసి 20–30 నిమిషాలు ఉంచి షాంపూతో కడిగేయాలి. వారానికోసారి అప్లై చేస్తే మంచిది. ఇది జుట్టు, స్కాల్ప్‌ను కండిషన్‌గా ఉంచడంలో తోడ్పడవచ్చు.

Also Read : జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

ఆముదం, ఉల్లిపాయ నూనె

ఉల్లిపాయ నూనె, ఉల్లిపాయ రసాన్ని హెయిర్ గ్రోత్ కోసం ఉపయోగించే ట్రెండ్ సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్‌ ఉండటంతో దీనిపై ఆసక్తి పెరిగింది. ఒక టేబుల్ స్పూన్ ఆముదంలో ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ నూనె కలిపి కొద్దిగా స్కాల్ప్‌కు మసాజ్ చేయవచ్చు. సుమారు 30 నిమిషాల తర్వాత కడిగేయండి.

ఉల్లిపాయ వాసన స్ట్రాంగ్గా ఉండొచ్చు. స్కాల్ప్ సెన్సిటివ్‌గా ఉంటే తక్కువ మోతాదుతో ప్రారంభించండి. మంట, దురద, ఎర్రదనం వంటి సమస్యలు వస్తే వెంటనే ఉపయోగించడం ఆపేయండి. ఈ మిశ్రమం స్కాల్ప్‌ను కండిషన్ చేయడంలో సహాయపడవచ్చు. పొడిబారిన జుట్టు, స్కాల్ప్‌కు మాయిశ్చరైజింగ్ కేర్ అందించవచ్చు.

Also Read : రైస్ వాటర్తో మెరిసే చర్మం, బలమైన జుట్టు కావాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ఆముదంలో రోజ్‌మేరీ

జుట్టు పెరుగుదల కోసం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పదార్థాల్లో రోజ్‌మేరీ కూడా ఒకటి. క్లినికల్ ట్రయల్‌లో ఆండ్రోజెనెటిక్ అలోపేసియా ఉన్నవారిలో రోజ్‌మేరీ ఆయిల్‌, 2 శాతం మినాక్సిడిల్‌ను పోల్చారు. ఆరు నెలల తర్వాత రెండు గ్రూపుల్లోనూ హెయిర్ కౌంట్ పెరిగినట్లు గుర్తించారు. అందుకే రోజ్మెరీ జుట్టు సంరక్షణలో భాగమైంది.

రోజ్‌మేరీ ఎసెన్షియల్ ఆయిల్‌ను నేరుగా స్కాల్ప్‌కు రాయకూడదు. ఆముదం లేదా కొబ్బరి నూనె వంటి క్యారియర్ ఆయిల్‌లో కొన్ని చుక్కలు కలిపి డైల్యూట్ చేసి ఉపయోగించాలి. మిశ్రమాన్ని స్కాల్ప్‌కు సున్నితంగా మసాజ్ చేసి సుమారు 30 నిమిషాల తర్వాత కడగవచ్చు. ఇది రక్తప్రసరణను పెంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.

Also Read : డ్రై హెయిర్ వల్ల జుట్టు రాలిపోతుందా? ఈ సహజ చిట్కాలతో సాఫ్ట్, షైనీ హెయిర్ పొందండిలా

కరివేపాకులో ఆముదం

కరివేపాకును హెయిర్ ఆయిల్స్‌, హెయిర్ మాస్కుల్లో కూడా కరివేపాకును ఉపయోగించే పద్ధతి ఉంది. కరివేపాకులోని సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు స్కాల్ప్‌కు ప్రయోజనాలు అందిస్తాయి. అయితే హెయిర్ ఆయిల్ రొటీన్‌లో భాగంగా ఉపయోగించాలనుకుంటే.. కొబ్బరి నూనె కొన్ని తాజా కరివేపాకు ఆకులను వేసి తక్కువ మంటపై కొద్దిగా వేడి చేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఆకులను వడకట్టండి.

కరివేపాకు ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్‌లో కొంత కాస్టర్ ఆయిల్ కలిపి స్కాల్ప్‌కు అప్లై చేయవచ్చు. ఈ మిశ్రమం జుట్టుకు కండిషనింగ్ అందించడంలో సహాయపడవచ్చు. పొడిబారిన జుట్టును మృదువుగా ఉంచేందుకు తోడ్పడవచ్చు.

ఆముదంలో వీటిని కలిపి అప్లై చేస్తే జుట్టుకు మంచి ప్రయోజనాలు అందుతాయి. అయితే పూర్తి జుట్టు సమస్యలను ఇవి దూరం చేస్తాయని అర్థం కాదు. అలాగే వీటిని ఉపయోగించే ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ చేస్తే మంచిది. 30 నిమిషాల నుంచి గంట వరకు ఉంచి తర్వాత తేలికపాటి షాంపూతో స్కాల్ప్‌, జుట్టును బాగా కడగండి.

Also Read : స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.