<p><strong>Case On Actor Venu:</strong> సినిమా నటుడు తొట్టెంపూడి వేణుపై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు అయింది. తొట్టెంపూడి వేణు ప్రతినిధిగా ఉన్న ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, రిత్విక్ ప్రాజెక్ట్స్ కలిసి 2002లో ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. అయితే పనులు ప్రారంభమైన తర్వాత ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ మధ్యలోనే వైదొలిగింది. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. ఇలా రద్దు చేసుకోవడం వల్ల తమకు భారీ నష్టం కలిగించారని వీరిపై రిత్విక్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు తొట్టెంపూడి వేణుతో పాటు సంస్థ సభ్యులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు</p>