Budget 2026: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తన తొమ్మిదవ కేంద్ర బడ్జెట్‌ను ఒక గంటా ఇరవై ఐదు నిమిషాలు ప్రసంగించారు.

ఈ మైలురాయి భారత చరిత్రలో వరుసగా తొమ్మిది బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తిగా ఆమె నిలిచారు. గత సంవత్సరం ఆమె నెలకొల్పిన ఎనిమిది బడ్జెట్‌ల రికార్డును ఆమె అధిగమించారు.

వాస్తవంగా బడ్జెట్ 2026ను 1 గంటా 25 నిమిషాల్లో ముగించిన సీతారామన్ ప్రసంగం ఆరో లాంగెస్టు స్పీచ్‌గా ఉంది.

బడ్జెట్ ప్రసంగ నిడివి ర్యాంకింగ్ (ఎక్కువ నుంచి తక్కువకు)

2020 - 162 నిమిషాలు

2019 - 137 నిమిషాలు

2021 - 110 నిమిషాలు

2022 - 92 నిమిషాలు

2023 - 87 నిమిషాలు

2024 (జూలై) - 85 నిమిషాలు

2026 - 85 నిమిషాలు (జూలై 2024తో సమం )

2025 - 77 నిమిషాలు

2024 (ఫిబ్రవరి మధ్యంతర) - 56 నిమిషాలు