BRS on Vice President Blection: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం.. గా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం

3 months ago 3
ARTICLE AD

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని BRS పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ వేధింపులు కారణమని ఆరోపించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలను BRS పార్టీ బహిష్కరించింది. తాము ఎన్నికల్లో ఎవరికీ మద్దతు తెలపడం లేదని, ఈ ఎన్నికలకు దూరంగా ఉండన్నట్లు బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు కె. సురేష్ రెడ్డి ఈ నిర్ణయాన్ని మీడియాకు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమపై వేధింపులకు పాల్పడుతుందని, రాజకీయంగా తమను ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పాల్గొనడం సరైనది కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలిపారు. సామాజిక న్యాయం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వ చర్యలు అడ్డంకిగా మారుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరంగా సరైన వాతావరణం లేకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సురేష్ రెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు సమర్థించాయని తెలిపారు. బీఆర్ఎస్ నిర్ణయంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణంపై చర్చలు జరుగుతున్నాయి.

అలాగే, NDAకు BRS మద్దతు అవసరం లేదని పార్టీ భావిస్తోంది. ఆ కారణంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల నుంచి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు సురేష్ రెడ్డి తెలిపారు.

Read Entire Article