<p><strong>Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు</strong></p>
<h2>Palnadu Latest News: మాచర్ల వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన వాహనం- నలుగురు స్పాట్ డెడ్ </h2>
<p>Palnadu Latest News: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతి చెందిన బంధువులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఘోరం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. వారిని మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారు తుఫాను వాహనంలో ఇరుక్కుపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. </p>