Top stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు

తెలంగాణ రెడ్కో డీఈ నివాసంలో ఏసీబీ ఆకస్మిక సోదాలు

తెలంగాణ రెడ్కో డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ నివాసంతో పాటు 15 ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ముమ్మర సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో DSP మాజిద్ ఖాన్ నేతృత్వంలో 8 బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మాదాపూర్‌లోని ఆయన నివాసంలో స్థిర, చరాస్తుల పత్రాలు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ తెలిపింది.

తెలంగాణలో టీచర్లకు స్పెషల్ టెట్ నోటిఫికేషన్..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2028 సెప్టెంబరు నాటికి టీచర్లు టెట్ పాస్ కావడం తప్పనిసరి. రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది ఇన్-సర్వీస్ టీచర్లు టెట్ సాధించాల్సి ఉంది. అలాగే, ప్రమోషన్ల కోసం ఎస్జీటీ, టీజీటీ ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్ష రాయనున్నారు. జులై 22-29 వరకు దరఖాస్తు చేసుకోవాలని టీచర్లకు సూచించారు. అయితే, తమకు వెయిటేజీ లేనందున అందరికీ ఒకే రకమైన అర్హత మార్కులు కేటాయించాలని కొందరు ఉపాధ్యాయులు కోరుతున్నారు.