Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు

Velugonda Project Updates: ఈ నెలాఖరులో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కి కృష్ణా జలాలు

Velugonda Project Updates: ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. ఆ ఏర్పాట్లపై మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం జిల్లా కలెక్టర్, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, టీడీపీ ఇంచార్జ్ లతో బుధవారం జూమ్ వేదికగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల 30 ఏళ్ల కలను సీఎం చంద్రబాబు నిజం చేశారన్నారు. ఈ నెల ఆఖరులో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దీని కోసం పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రాజెక్ట్ పనులతోపాటు నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరిస్తుందని చెప్పారు. అందులో భాగంగా తొలి విడత రూ.318 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇక మిగిలిన 4,761 కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.600 కోట్లలో త్వరలోనే రూ.300 కోట్లు జమ చేస్తామన్నారు. చివరి విడత రూ.300 కోట్లు త్వరలో చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వెలుగొండ నిర్వాసిత గ్రామాల్లో నిర్వాసితులను త్వరితగతిన ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు.

Tadepalli Latest News: తాడేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో కత్తితో యువకుడు వీరంగం

Tadepalli Latest News:తాడేపల్లి సలాం సెంటర్‌కు చెందిన వేముల వెంకటేష్ అనే యువకుడు నడిరోడ్డు మీద కత్తితో హడావుడి చేశారు. స్థానికులు మీదకి దూసుకువెళ్లడంతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు.

Bhogapuram Latest news: భోగాపురంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్- న్యూఢిల్లీ నుంచి వచ్చిన గంటా, సీఎం రమేష్

Bhogapuram Latest news: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకల సందడి మొదలైంది. వాస్తవానికి ఈనెల 17వ తేదీ తర్వాత రెగ్యులర్ విమాన సర్వీస్‌లు ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అయితే ఆ సమయానికన్నా ముందే ప్రత్యేక విమానాల ల్యాండింగ్ మొదలైంది. ఢిల్లీ నుంచి భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బుధవారం ప్రత్యేక విమానంలో భోగాపురం విమానాశ్రయంలో దిగ్గా.. మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు ప్రత్యేక విమానంలో వెళ్తూ కాకతాళీయంగా కలుసుకున్నారు.