<p><strong>Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు</strong></p>
<h2>Telangana Mass Killing: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు </h2>
<p>Telangana Mass Killing:రంగారెడి జిల్లాలోని షాబాద్, దైవాలగూడలో జరిగిన ఆరు హత్యలు కలకలం రేపాయి. దీనిపై స్పందించిన ప్రతిపక్షాలు బాధితుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిను చేవెళ్ల వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కూడా చేవెళ్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిను శంకర్‌పల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.</p>