Brahmamudi Serial Today Episode: ముసుగులో వచ్చి అపర్ణను మోసం చేస్తున్నావా..? అంటూ రుద్రాణి కోపంగా రేవతిని తిడుతుంది. అయితే రాజ్‌ అడ్డుపడి రేవతిని తీసుకొచ్చింది నేనే అని చెప్తాడు. అందుకు తాము హెల్ప్‌ చేశామని ఫ్యామిలీ మెంబర్స్‌ చెప్తారు.

రుద్రాణి: అయితే అందరూ కలిసి మా వదినను మోసం చేశారా

ఇందిరాదేవి: రుద్రాణి మోసం చేసింది ఎవరు..? రేవతికి తెలియని వయసులో తప్పుడు సలహాలు ఇచ్చి తను ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం అయింది ఎవరు..? నువ్వు కాదా..?

రుద్రాణి: అంటే అప్పుడు రేవతి ప్రేమించిన వాడు దక్కకపోతే చచ్చిపోతాను అంటే ఏదో ధైర్యం కోసం

ఇందిరాదేవి: చాల్లే నోరు మూయ్‌ చేసిందే పనికిమాలిన పని మళ్లీ దాన్ని సమర్థించుకుంటున్నావా..? ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వు నేను కాదు.. అపర్ణ. ఇంత మంది రేవతి ఇంటికి రావాలని కోరుకుంటున్నాం.. అపర్ణ కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సింది.

రాజ్‌: అమ్మా అప్పుడెప్పుడో అక్క తప్పు చేసిందని ఇప్పటికి కూడా శిక్ష వేయడం సరి కాదమ్మా. అక్క పెళ్లి చేసుకునే సమయానికి నేను చిన్న పిల్లాడిని.. అక్క వెళ్లి పోతుంటే ఆపొచ్చు అనే విషయం కూడా తెలియదు నాకు. మీరందరూ పెద్ద వాళ్లు కదమ్మా అక్క వెళ్లిపోతుంటే ఎందుకు ఆపలేదు. మీకు చెప్పకుండా వెళ్లిపోవడం తప్పే.. కానీ దానికి ఇంత పెద్ద శిక్ష వేయాలా..? ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ల తప్పును కూడా క్షమిస్తే ప్రేమ ఉన్నట్టు.. అని నువ్వే చెప్పావు కదా అమ్మా.. మరి అక్కను ఎందుకు క్షమించలేదు అమ్మ. మనం అందరం ఉండి కూడా అక్క అనాథలాగా ఎక్కడో ఎందుకు ఉండాలి. తన బిడ్డకు ఎవ్వరూ లేరని ఎందుకు చెప్పుకోవాలి చెప్పు

కావ్య: అత్తయ్యా తన తప్పు తాను తెలుసుకుంది. తను ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాతే మీరు పడుతున్న బాధలను అర్థం చేసుకుంది. తను కోలుపోయిన తల్లి ప్రేమను తిరిగి పొందాలని ఆశ పడుతుంది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి అత్తయ్యా

ఇందిరాదేవి: నువ్వు దూరం పెట్టినప్పటి నుంచి అది ఎక్కడుందో తెలుసుకుని దాని బాగోగులు చూసుకోవాలని నేను మీ మామయ్య కలిసి తనకు ఎన్నో సార్లు డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించాము.. కానీ ఇది అమ్మ నాకు వేసిన శిక్ష నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి. అమ్మ నన్ను క్షమించింన రోజే నేను మళ్లీ ఆ ఇంటి బిడ్డను అవుతానని ఆ శిక్ష అనుభవిస్తుందే..

రాజ్: నీ కోపాన్ని పక్కన పెట్టి ఒక్కసారి అక్కను చూడమ్మా.. తన బాధను అర్థం చేసుకుని తనను క్షమించు అమ్మ

రుద్రాణి: అంటే ఏంట్రా ముసుగు వేసుకుని వచ్చి మోసం చేసినా కూడా తనను క్షమించాలా..?

అపర్ణ: ముసుగులో ఉన్నది రేవతి అన్న విషయం నాకు తెలుసు.. నా కూతురును నేను గుర్తు పట్టలేనా.? మొదట్లో అది చేసిన పనికి కోపం వచ్చినా.. మెల్లమెల్లగా నాలో బాధ మొదలైంది. కానీ లాస్ట్‌ టైం అది ఇంటికి వచ్చినప్పుడు దాన్ని చూసేసరికి అది చేసిన తప్పు గుర్తుకు వచ్చి దాని మీద అరిచేశాను. ఎప్పటికీ దాన్ని క్షమించకూడదు అనుకున్నాను. కానీ ఒక రోజు అనుకోకుండా నా మనవణ్ని తీసుకుని తన ఇంటికి వెళ్లాను..

అని ప్లాష్‌బ్యాక్‌ చెప్తుంది. రేవతి తన తల్లి అపర్ణను గుర్తు చేసుకుని ఏడుస్తుంది. అంతా గుమ్మం దగ్గర నిలబడి చూస్తుంది. అపర్ణ కూడా ఎమోషనల్‌ అవుతుంది.

అపర్ణ: ఆరోజు నిన్ను చూశాక నీ మాటలు విన్నాక నాలోని కోపం బాధ అన్నీ అక్కడే చచ్చిపోయాయి. ఇన్నేళ్లుగా నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థం అయింది. నువ్వు చెప్పింది నిజమేరా ఒక మనిషిని మనం ప్రేమించామంటే వాళ్ల తప్పులను కూడా క్షమించేంత గొప్పగా ప్రేమించాలి. కానీ కన్న కూతురు నాకు చెప్పకుండా పెళ్లి ఎలా చేసుకుంటుంది అనే కోపం నా ప్రేమను కప్పేసింది అనుకుంటా..? అందుకే దూరంగా వెళ్లిపోమ్మని శిక్షించాను..

రేవతి: అమ్మా తప్పు నేను చేశాను.

అపర్ణ: నువ్వు ముసుగు వేసుకుని వచ్చినంత మాత్రాన నిన్ను నేను గుర్తు పట్టలేనా..? నేను నీ తల్లినే నువ్వే కాదు.. నీ ఊపిరి తగిలితే పొంగిపోతానే

అనగానే.. రేవతి ఏడుస్తూ అపర్ణ కాళ్ల మీద పడుతుంది.

అందరూ కలసిపోతారు. హ్యాపీగా ఉంటారు. తర్వాత అప్పు రూంలో కూర్చుని కావ్య గురించి డాక్టర్‌ చెప్పిన విషయాలు గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఇంతలో కళ్యాణ్‌ వచ్చి ఓదారుస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title=" ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!