Brahmamudi Serial Today Episode: రాజు, ఇందులకు థాంక్స్‌ చెప్పి వెళ్లిపోతుంది సిరి. తర్వాత యూనిఫామ్‌లో వెళ్లి చలపతి, లక్ష్మీని ఆటపట్టిస్తుంది నందు. స్వాతి జాబ్‌ కొట్టేస్తుంది. లక్కీ, ఐశ్వర్యల పెళ్లికి ముహూర్తం పెట్టేస్తారు. ఇంకా ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్‌ ఏపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

రాజు, ఇందుకు థాంక్స్‌ చెప్పిన సిరి

రాజు, ఇందులకు సిరి థాంక్స్‌ చెప్పి వెళ్లిపోతానని రెడీ అవుతుంది. ఎక్కడికి వెళ్తావని ఇందు అడిగితే.. తనకు బావ ఉన్నాడని వాళ్లిద్దరు పెళ్లి చేసుకుంటామని బావ దగ్గరకే వెళ్తున్నానని చెప్తుంది. అప్పుడే క్యాబ్‌ రావడంతో ఎక్కి వెళ్లిపోతుంది సిరి.

పోలీస్‌ యూనిఫామ్‌ లో వెళ్లి చలపతిని బెదిరించిన నందు

<a title=" ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

చలపతి టిపిన్‌ కోసం అల్లరి చేస్తుంటాడు. అప్పుడే లక్ష్మీ ఇడ్లీ తీసుకొస్తుంది. ఎప్పుడూ ఇడ్లీయేనా అంటూ కోప్పడుతుంటాడు. అప్పుడే నందు యూనిఫాంలో వచ్చి తలకు క్యాప్‌ అడ్డుగా పెట్టుకుని హ్యాండప్స్‌ అంటుంది. చలపతి, లక్ష్మీ భయంతో వణికిపోతూ.. లేచి చేతులు పైకి ఎత్తి నిలబడతారు. నందు వాళ్లిద్దరిని భయపెడుతుంది. మీ కొడుకు ఇడ్లీలో గంజాయి అమ్ముతున్నాడని సమాచారం వచ్చింది అరెస్ట్‌ చేయడానికి వచ్చానని కాసేపు వాళ్లను ఆట పట్టిస్తుంది. చలపతి, లక్ష్మీ భయంతో వణికిపోతుంటే ముఖానికి అడ్డుగా ఉన్న క్యాప్ తీసేస్తుంది నందు. నందును చూసిన చలపతి, లక్ష్మీ షాక్ అవుతారు. అప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చిన వెంకీ కూడా చూసి షాక్‌ అవుతాడు. తర్వాత అందరూ కలిసి జోక్స్‌ వేసుకుని నవ్వుకుంటారు. వెంకట్‌, నందుకు కంగ్రాట్స్‌ చెప్తాడు. సరే అంటూ నందు వెళ్లిపోతుంది.

రాజు, ఇందు పెళ్లి గురించి మాట్లాడుకుంటారు

ఇందు దగ్గరకు వెళ్లిన రాజు ఇక అన్ని సమస్యలు తీరిపోయాయి ఇక నువ్వు ఏం చేయబోతున్నావు అని అడగ్గానే.. జీవితంలో నలుగురికి హెల్ఫ్‌ చేసి మంచిపేరు తెచ్చుకుంటాను అంటుంది. ఇంక చాలు ఏదీ సరిగ్గా చెప్పవా..? నువ్వు అందరి లైఫ్‌ సెటిల్‌ చేశావు.. ఇక నువ్వు పెళ్లి చేసుకోవా..? అని అడిగితే నిన్ను చేసుకున్నాను కదా అంటుంది ఇందు. రాజు షాక్‌ అవుతాడు. మనది అద్దె పెళ్లి నేను అడిగేది నిజమైన పెళ్లి గురించి అంటాడు. ఇప్పటికైతే హ్యాపీగా ఉన్నాను ఇలాగే ఉంటే సరిపోదా..? అని రాజు అడిగితే.. ఎలా సరిపోతుంది. మన బంధం శాశ్వతం కాదు కదా నేను వెళ్లిపోయాక నీకో తోడు కావాలి. ఈ ఇంటికి వారసుడు కావాలి అది నీకు వద్దా అని రాజు అడిగితే ఎందుకు వద్దు బావ నువ్వే ఇక్కడే ఉండిపోవాలని ఉంది.

నువ్వు నోరు తెరచి అడిగితే సంతోషం బావ అని మనసులో అనుకుంటుంది. నిన్ను శాశ్వతంగా నా గుండెల్లో దాచుకుంటాను అనుకుంటుంది. సరే నీ సంగతి ఏంటి..? మన అగ్రిమెంట్‌ పూర్తి అయ్యాక ఇంటికి వెళ్లి మరో పెళ్లి చేసుకుంటావా..? అని ఇందు అడిగితే.. నీలాంటి అమ్మాయి దొరికితే కచ్చితంగా ఇప్పుడే ఈ క్షణమే చేసుకుంటాను అంటాడు రాజు. నన్నే చేసుకుంటానని డైరెక్టుగా చెప్పొచ్చు కదా బావ అని మనసులో అనుకుంటుంది ఇందు. రాజు మాత్రం నీలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుంతుంది. ఇక నాకు ఎక్కడ దొరుకుతుంది అంటే మనిషిని పోలిన మనిషులు ఏడుగురు ఉంటారట కదా వెతుకు రాజు వెతికితే కచ్చితంగా దొరుకుతారు అంటూ చెప్తుంది. సరే అంటూ రాజు వెళ్లిపోతాడు.

జాబ్‌ కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన స్వాతి

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

మరోవైపు జాబ్‌ కోసం ఇంటర్వ్యూ కోసం వెళితే డిగ్రీ లేదని అక్కడి వాళ్లు స్వాతిని వెళ్లిపోమ్మని చెబితే.. స్వాతి రిక్వెస్ట్‌ చేస్తుంది. ఈ జాబ్‌ నాకు చాలా అవసరం సార్‌ ఇంకో ఆరు నెలల్లో డిగ్రీ సర్టిఫికెట్‌ వస్తుంది. ఎఫ్రిల్‌లో కచ్చితంగా డిగ్రీ తీసుకొస్తాను సార్‌. కావాలంటే నేను డిగ్రీ చేస్తున్న బేగంపేట డిగ్రీ కాలేజీలో ఎంక్వైరీ చేసుకోండి అని చెబితే.. ఆ వ్యక్తి తాను కూడా అదే కాలేజీలో చదివానని స్వాతితో మాటలు కలిపి అన్ని విషయాలు మాట్లాడతాడు. తన చదివిన కాలేజీలో చదువుతున్నావు కాబట్టి నీకు జాబ్ ఇస్తున్నాను అంటాడు.

లక్కీ, ఐశ్వర్యల పెళ్లి కోసం ముహూర్తం ఫిక్స్‌

రాజు పంతులును పిలిపించి లక్కీ, ఐశ్వర్యల పెళ్లి కోసం ముహూర్తం పెట్టించాలని చెప్తారు. ఇప్పుడే ఏం తొందర వచ్చిందని రేఖ అంటే.. త్వరగా పెళ్లి జరిగితేనే కదా ఆంటీ నేను త్వరగా కంపెనీకి ఓనరును అవుతానని ఐశ్వర్య అంటుంది. రాజు, ఇందు మంచి ముహూర్తం చూడమని చెప్తారు. రాజు మరో మాటగా వారం రోజుల్లో ఏదైనా ముహూర్తం ఉంటే చెప్పమంటాడు. లక్కీ మాత్రం అంత దూరం ఎందుకు మామ నా ఐషుకు నేను అంత దూరం ఉండలేను అంటాడు. పెళ్లి అయ్యాక కూడా నిన్ను దగ్గరకు రానిస్తుంది అనుకోవడం లేదు అంటుంది నందు. నేను చాలా హోప్స్‌ పెట్టుకున్నాను అంటాడు లక్కీ. ఇక పెళ్లి ఎలా జరిపించాలో అంటూ అందరూ మాట్లాడుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త