Brahmamudi Serial Today Episode: అబార్షన్‌ విషయంలో సీతారామయ్య కోపంగా రాజ్ ను తిట్టి కొడతాడు. అయినా రాజ్‌ తన నిర్ణయంలో మార్పు లేదని మీరే కావ్యను ఒప్పించాలని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.

ధాన్యం: విన్నావు కదా కావ్య రాజ్‌ ఏం చెప్పాడో.. వాడు నిర్ణయం మార్చుకోడంటా..? ఇక ఆలోచించుకోవాల్సింది నువ్వే.. నువ్వు రాజ్‌ చెప్పినట్టు వినాలి అని చెప్పే హక్కు నాకు లేకపోవచ్చు కానీ ఇంట్లో గొడవలు జరిగితే మాత్రం నేను ఈ ఇంట్లోంచి వెళ్లిపోతాను. దానికోసం నువ్వేం చేస్తావో నీ భర్తను ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం

అని చెప్పి ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. కావ్య ఏడుస్తూ వెళ్లిపోతుంది.

అపర్ణ: ఏంటి అత్తయ్య వాడు మారాలని మనం ఎంత చేసినా వాడు మారడం లేదు.. చివరికి ఇలా జరిగిందేంటి..

ఇందిరాదేవి: నాకేం అర్థం కావడం లేదు అపర్ణ. వాడు మారాలని మనం ప్రయత్నించాం.. వాడు మారడం లేదు.. నా మనవరాలికి బిడ్డను దూరం చేసుకోమని చెప్పలేము.. ఇప్పుడు ఏం చేయాలి

రుద్రాణి: (మనసులో) ఏది జరగాలని కోరుకున్నానో కరెక్టుగా అదే జరిగింది. ధాన్యలక్ష్మీకి చిన్న నిప్పు పెట్టగానే కుటుంబం మొత్తాన్ని తగలేసింది. ఇప్పుడు రాజ్‌ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి

అనుకుంటుంది. తర్వాత అప్పు రూంలో కూర్చుని ఆలోచిస్తుంది. అప్పుడే కళ్యాణ్‌ జ్యూస్‌ తీసుకుని వెళ్తాడు.

కళ్యాణ్‌: పొట్టి ఇప్పుడు ఏం జరిగిందని అంతలా బాధపడుతున్నావేంటి..?

అప్పు: ఇంకా ఏం జరగాలని కూచి ఇందాక అత్తయ్య ఎంత గొడవ చేసిందో ఎన్ని మాటలు అన్నదో నువ్వే విన్నావు కదా..? అసలు మా కావ్య అక్క చేసిన తప్పేంటి కూచి నువ్వే చెప్పు.. కారణం చెప్పకుండా అబార్షన్‌ చేయించుకో అంటే ఏ తల్లి అయినా అలాగే రియాక్ట్‌ అవుతుంది. తప్పు చేస్తుంది బావ అయితే శిక్ష మా అక్కకా..?

కళ్యాణ్‌: తప్పు అన్నయ్యదో వదినదో కాదు.. నీది

అప్పు: ఏం మాట్లాడుతున్నావు కూచి నేను తప్పు చేశానంటావేంటి..?

కళ్యాణ్‌: మరి లేకపోతే ఏంటి పొట్టి అసలు నువ్వే కనక టైంకి ఫుడ్‌ తీసుకుని రెస్ట్‌ తీసుకుని ఉంటే ఈ గొడవ జరిగేదా..? నీవల్ల కడుపులో బిడ్డకు ఎమవుతుందోననే అమ్మ అంత గొడవ చేసింది. అంటే ఒక రకంగా ఈ గొడవకు కారణం నువ్వే కదా..? ఇలా అస్తమానం ఆలోచిస్తూ కూర్చుంటే ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అవుతుందా..?

అప్పు: కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే కూచి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రాబ్లమ్‌ సాల్వ్‌ కాదు.. ఈరోజు ఎలాగైనా సరే అక్కకు నిజం తెలియాల్సిందే.. ఈ ప్రాబ్లమ్‌కు పులిస్టాప్‌ పెట్టాల్సిందే..

అంటూ నిజం చెప్పడానికి అప్పు వెళ్తుంటే..

కళ్యాణ్‌: వద్దు పొట్టి.. వదినకు నిజం తెలిస్తే తట్టుకోలేదనే కదా అన్నయ్య చెప్పకుండా ఆగింది. అన్నయ్య ఎలాగైనా వదినకు తెలియకుండా అబార్షన్‌ చేయించాలని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు..అన్నయ్య ప్రయత్నం చేస్తా అంటున్నారు కదా చేయనిద్దాం. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు

అంటూ కళ్యాణ్‌ జ్యూస్‌ ఇస్తాడు అప్పుకు. ఇక లాన్ లో ఒంటరిగా కూర్చున్న కావ్య ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకుని బాధపడుతుంది. చివరకు ఒక నిర్ణయానికి వచ్చి తన నిర్ణయాన్నంతా లెటర్‌ గా రాసి రూంలో పెట్టి వెళ్లిపోతుంది. మరుసటి రోజు లెటర్‌ చదివిన అపర్ణ రాజ్‌ ను తిడుతుంది. అందరూ రాజ్‌ను తిడతారు. మరోవైపు కావ్య తన పుట్టింటికి వెళ్తుంది. ఒక్కదానివే వచ్చావా..? అల్లుడుగారు రాలేదా అని కనకం అడిగితే కనకం మీద కొప్పడుతుంది కావ్య. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title=" ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!