Brahmamudi Serial Today Episode: ఇంట్లోకి వచ్చిన రుద్రాణి అందరూ హ్యాపీగా ఉండటం చూసి.. మీరంతా ఇంత సంతోషంగా ఉన్నారు. ఈ ఇంటికి మరో సమస్య రాదని గ్యారంటీ ఉందా..? అని అడుగుతుంది. ఇంట్లో ఇంత ఆనందం చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఆ రోజు రాత్రంతా బాగా పార్టీ చేసుకున్నాం. తెల్లారితే కారులో శవం దొరికింది అంటూ రుద్రాణి మాట్లాడుతుంది.

ప్రకాష్‌: ఆ నోటి నుంచి ఒక్కసారైనా మంచి మాట రాదా..?

అపర్ణ: ఇంక చాలు నువ్వు నోరు తెరవొద్దు

రుద్రాణి: బాగుంది వదిన ఆస్థులు పోవడానికి నేను కారణం అయ్యానా..? మా నాన్న కారణం అయ్యాడు. అప్పుల పాలు అవ్వడానికి నేను కారణం అయ్యానా..? ఈ రాజ్‌, కావ్యలు కారణం అయ్యారు. ఇప్పుడు రాజ్‌ అరెస్ట్ అవ్వడానికి నేను కారణం అయ్యానా..? ఆ అనామిక చేయించింది. జరిగిన దానికి జాగ్రత్త పడమంటుంటే నేను చెడ్డ దాన్ని అయ్యానా..? చూస్తూ ఉండండి.. ఈ సంతోషం ఎక్కువ కాలం నిలబడదు

అపర్ణ: ఎలాంటి సమస్యలు ఎదురైనా.. నా కొడుకు, కోడలు చూస్తూ ఊరుకోరు.. వాటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంటారు.

రుద్రాణి: ఏమో వదిన ఈ సారి ఎవరి చేతుల్లో లేనిదే జరుగుతుందేమో..?

అంటూ రుద్రాణి చెప్తుండగానే.. ఫారిన్‌ నుంచి వచ్చిన యామిని కారులో స్పీడుగా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వచ్చిన యామినిక పేరెంట్స్‌ గ్రాండ్‌ వెల్కం చెప్తారు. ఫారిన్‌ వెళ్లి అంతా మర్చిపోయావు మారిపోయావు ఇకనైనా పెళ్లి చేసుకో అని వైదేహి అడగుతుంది.

యామిని: అవును మమ్మీ పెళ్లి చేసుకుంటాను

అంటూ రాజ్‌ ఫోటో చూపిస్తుంది.

వైదేహి: (భయంగా) నువ్వింకా మారలేదా..?

యామిని: నేను నా అలవాట్లను మర్చిపోయాను కానీ ప్రేమను కాదు మమ్మీ..

వైదేహి: అయితే ఆ అబ్బాయి అమ్మానాన్నలతో మాట్లాడతాము వాళ్లెక్కడుంటారో కనుక్కో

యామిని: మమ్మీ మీరు మాట్లాడాల్సింది రాజ్‌ పేరెంట్స్‌ తో కాదు. రాజ్‌ వైఫ్‌తో

అని యామిని చెప్పగానే వైదేహి వాళ్లు షాక్‌ అవుతారు. పెళ్లయిన వాడిని ఎలా చేసుకుంటావు అని అడుగుతారు. దీంతో సింపుల్‌గా కావ్యను రాజ్‌కు దూరం చేస్తే సరి అని చెప్పి వెళ్లిపోతుంది యామిని. వైదేహి ఆమె భర్త భయపడుతుంటారు. మరోవైపు రూంలో బట్టలు మార్చుకుంటున్న రాజ్‌ యామిని గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో కావ్య వస్తుంది.

కావ్య: ఏంటి కొత్త మర్డర్‌కు ఏమైనా ఆలోచిస్తున్నారా..? బట్టలు మార్చుకోవడానికి ఇంతలా ఆలోచిస్తుంటే.. జైలును మిస్‌ అవుతున్నారేమో అనిపిస్తుంది.

రాజ్‌: ఏం మిస్‌ అయితే నువ్వు నన్ను మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు పంపిస్తావా..?

కావ్య: వెళ్లాలని ఆశగా ఉంటే చెప్పండి అనామికతో మాట్లాడతాను

రాజ్‌: అబ్బో వద్దు తల్లి ఇన్ని రోజులు ఈ నాలుగు గోడల మధ్య ఉంటూ నీతో ఉంటూ.. ఇదే పెద్ద జైలులా ఫీలయ్యేవాణ్ని ఇప్పుడు అక్కడికి వెళ్లాక ఆ వాతావరణం చూశాక వాళ్లకంటే నీవే బెటర్‌ అనిపిస్తుంది. నాకు మళ్లీ ఆ పోలీస్‌ స్టేషన్‌ గుర్తు చేయకమ్మా..

కావ్య: నాలుగు రోజులు పోలీస్‌ స్టేషన్‌లో ఉండి వస్తే.. ఈ భార్య విలువ తెలిసొచ్చిందన్నమాట.. బుద్దుడికి బోధి చెట్టు కింద జ్ఞానం వచ్చినట్టు భర్తలకు పోలీస్‌ స్టేషన్‌లో జ్ఞానం వచ్చిందేమో

అని కావ్య మాట్లాడుతుండగానే.. రాజ్‌ కావ్యను హగ్‌ చేసుకుంటాడు.

కావ్య: ఏవండి ఇది రాత్రి కాదు పగలు.. ఎవరైనా వస్తారేమో

రాజ్: ఈ గదిలోకి ఎవ్వరూ రారు.. మన మధ్యకు అసలు రారు

కావ్య: ఒకవేళ వస్తే..

రాజ్‌: అలా వస్తే నువ్వు ఊరుకోవు కదా..? అలా వస్తే.. యముడినైనా ఎదిరించి నీ భర్తను తెచ్చుకునే లేడీవి కదా నువ్వు

అంటాడు రాజ్‌. మరోవైపు యామిని వాళ్ల అమ్మా నాన్నలు డాక్టర్‌ తో యామిని ఇంతకు ముందులాగే ప్రవర్తిస్తుందని మీరేమో ట్రీట్‌మెంట్‌ ఇచ్చాం మారిపోయింది అన్నారు అని అడుగుతారు. దీంతో డాక్టర్‌ మీ అమ్మాయి డ్రగ్స్‌ తీసుకోవడం మానేసింది కానీ తనకు దక్కని తన ప్రియుడి విషయంలో అలాగే ఉందని నిజం చెప్తాడు. దీంతో వైదేహి తన భర్త షాక్‌ అవుతారు. లోపల యామిని కావ్య ఫోటో తీసుకుని కాలుస్తుంది. తర్వాత రాజ్‌కు వాయిస్‌ మెసేజ్‌ చేస్తుంది. మెసేజ్‌ చూసిన రాజ్‌ భయపడిపోతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!