Brahmamudi Serial Today Episode: ఉదయం ఎనిమిది అయినా రాజ్‌ నిద్ర లేవకపోవడంతో కావ్య వెళ్లి నిద్ర లేపుతుంది. రాజ్‌ను నిద్ర లేపే టైంలో కాలు స్లిప్‌ అయి రాజ్‌ మీద పడుతుంది. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి రొమాంటిక్‌ సీన్‌ జరగుతుంది. తర్వాత తేరుకుని రాజ్‌ వెంటనే బెడ్‌ మీద నుంచి లేచి రెడీ అయి ఆఫీసుకు బయలుదేరుతారు. కావ్య, రాజ్‌ కారులో వెళ్తుంటారు.

కావ్య: ఏవండి ఏంటా స్పీడు కాస్త స్లోగా వెళ్లండి.

రాజ్: లేటయింది కదా..? అందుకే స్పీడు

కావ్య: అవునా మనం లేట్‌ రాజ్‌, లేట్‌ కావ్య కాకూడదంటే ముందు స్పీడు ఆపండి. అయినా మీరు ప్రజెంటేషన్‌ ఇవ్వాలంటే ఫైల్‌ ఉండాలి కదా..?

రాజ్‌: అయ్యో ఫైల్‌ ఇంట్లోనే మర్చిపోయాను.. అంతా నీవల్లే..

కావ్య: మీరు లేటుగా లేచారు. లేటుగా ఆఫీసుకు బయలుదేరారు మళ్లీ నన్ఉ అంటారేంటి..?

అని రాజ్‌కు చెబుతూ.. కారు ఆపండి నేను ఆటోలో వెళ్లి ఫైల్‌ తీసుకుని వస్తాను మీరు ఆఫీసుకు వెళ్లండి అని కావ్య ఇంటికి వెళ్తుంది. రాజ్‌ ఆఫీసుకు వెళ్తాడు. ఆఫీసుకు రాజ్‌ ఒక్కడే రావడం చూసిన సెక్యూరిటీ అనామికకు ఫోన్‌ చేసి విషయం చెప్తాడు. సరే నేను చూసుకుంటాను అంటుంది.

సామంత్‌: ఏంటి అనామిక.. ఏమైంది..?

అనామిక: కావ్య ఆఫీసుకు రాలేదంట..

సామంత్‌: కావ్య ఆఫీసుకు వస్తే మనకేంటి..? రాకపోతే మనకేంటి..?

అనామిక: కానీ కావ్యను రాజ్ ను ఆ జగదీష్‌ తిడుతుంటే చూడాలని ఉంది.

అంటూ అనామిక కావ్యకు ఫోన్‌ చేస్తుంది.

అనామిక: హలో ఎలా ఉన్నావు మేడం.. ఇప్పుడు బెస్ట్‌ డిజైనర్ అవార్డు అందుకోనున్నావా..? నువ్విలా బయట ఉండి నన్ను డిస్టర్బ్‌ చేస్తే ఎలా…?

కావ్య: కొంచెం కాదు బాగా డిస్సపాయింట్‌ అవ్వడానికి రెడీ అవ్వు ఇంకాసేపట్లో నేను గెలవబోతున్నాను.

అనామిక: ఇంకాసేపట్లో మీ ఆఫీసులో మీకు నష్టం జరగబోతుంది. మీరు రోడ్డు మీదకు రాబోతున్నారు. నన్ను అవమానించి మీరంతా సంతోషంగా ఉంటే.. నేను చూస్తూ ఊరుకుంటానా..? అందుకే మీకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని చూశాను. అందుకే ఇప్పుడు నా టైం వచ్చింది ముందు నువ్వు త్వరగా వెళ్లు నీ మొగుడు మాత్రమే అవమానాలు పడితే ఎలా చెప్పు ఇద్దరూ కలిసి తనివితీరా అనుభవించండి..

అని ఫోన్‌ కట్‌ చేస్తుంది అనామిక. కావ్య అనుమానంగా రాజ్‌కు ఫోన్‌ చేస్తుంది. రాజ్‌ తన ఫోన్‌ క్యాబిన్ లో పెట్టి హాల్‌లో జగదీష్‌కు నగలు చూపిస్తుంటాడు. రాజ్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో భయంగా కావ్య ఆటోను త్వరగా వెళ్లు అని చెప్తుంది.

రాజ్ తో పాటు జగదీష్‌ నగలు చూస్తారు.

రాజ్‌: ఎలా ఉన్నాయి సార్‌..

జగదీష్‌: చాలా బాగున్నాయి రాజ్‌… ఇంకో మాట ఇతను గోల్డ్‌ అప్రైజర్‌ ఈ నగలన్నీ క్వాలిటీ టెస్ట్‌ చేస్తారు. జస్ట్‌ ఫార్మాలిటీ కోసం.

రాజ్: ఓకే సార్‌

అప్రైజర్‌ చెక్‌ చేస్తూ.. నగలన్నీ ప్యూర్‌ గోల్డ్‌ తో చేశారు సార్‌ అంటూ చెప్తూ.. కిరీటం చెక్‌ చేసి అనుమానంగా చూస్తుంటాడు.. ఏమైందని జగదీష్‌ అడగ్గానే.. ఈ కిరీటం గోల్డ్‌ ది కాదు సార్‌ నకిలీది.. అంటాడు. దీంతో జగదీష్ కోపంగా రాజ్‌ను తిడుతుంటాడు. ఇంతలో కావ్య వస్తుంది. అది నిజంగానే గోల్డ్‌ కాదని సెక్యూరిటీ పర్పస్‌ లో భాగంగా నకిలీది అందులో పెట్టామని వర్జినట్‌ నా లాకర్‌లో ఉందని చెప్పి రాజ్ ను తీసుకెళ్లి వర్జినల్‌ కిరీటం ఇస్తుంది. అది చూసిన అప్రైజర్‌ ఇది ప్యూర్‌ గోల్డ్‌ సార్‌ అని చెప్తాడు. రాజ్‌కు జగదీష్‌ సారీ చెప్తాడు. అంతా చూస్తున్న సెక్యూరిటీ షాక్‌ అవుతాడు. బయటకు వెళ్లి అనామికకు ఫోన్‌ చేసి నిజం చెప్తాడు. అనామిక షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!