Brahmamudi Serial Today Episode: కావ్య ముందు తానే గొప్ప అని నిరూపించుకునేందుకు రాజ్‌ ప్రయత్నిస్తాడు. అందుకోసం కావ్య వేసిన డిజైన్‌ నెక్లెస్‌ ను వేలంలో ఎక్కువ రేటుకు అమ్మాలనుకుంటాడు. అందుకోసం ఆన్‌లైన్‌ ఆక్షన్‌ నిర్వహిస్తాడు. అందులో తన ఫ్రెండ్‌ సూరజ్‌ పాల్గొని నెక్లెస్‌ రేటు ఎక్కువ పెరిగేలా చేస్తాడు. అనుకున్నట్టుగానే.. 25 లక్షల నెక్లెస్‌ ను రాజ్‌ తన తెలివితో కోటి ఎనభై లక్షలకు అమ్మిస్తాడు. దీంతో కావ్య ఆశ్చర్యపోతుంది.

రాజ్‌: నువ్వు ఊహించిన రేటు ఎంత..?

కావ్య: 25 లక్షలు..

రాజ్‌: వచ్చింది ఎంత..?

కావ్య: కోటి ఎనభై లక్షలు

రాజ్‌: సో నువ్వు ఎంత కష్టపడి డిజైన్‌ వేశావో ఎంత క్రియేటివ్‌గా డిజైన్‌ వేశావో అన్నది పాయింటా..? దాన్ని ఇంత రేటుకు అమ్మడం పాయింటా..?

కావ్య: మహానుభావ మీరే గ్రేటు.. ఒప్పుకున్నాను.

రాజ్‌: నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనే గ్రేట్‌..

కావ్య: అవును అంటున్నానుగా..

రాజ్: ఇంకెప్పుడు డిజైనర్‌ సీఈవో గ్రేట్‌ అనకు..

కావ్య: కలలో కూడా అనను..

రాజ్‌: ఇక్కడుంది స్వరాజ్‌ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంటాడు.

అని చెప్పగానే.. కావ్య కూడా ఒప్పుకుంటున్నాను మహానుభావ అంటుంది. మరోవైపు స్వప్న తన ప్లాట్‌ లో రెంట్‌కు ఉన్న వ్యక్తికి ఫోన్‌ చేసి రెంట్‌ ఇంకా పే చేయలేదని అడుగుతుంది. లేదు మేడం ఇప్పుడే రెండు లక్షలు మీకు సెండ్‌ చేశాను. చూసుకోండి అని చెప్తాడు. స్వప్న సరే అంటుంది. దూరం నుంచి అంతా వింటున్న రుద్రాణి, రాహుల్‌ బాధపడతారు. మనం చిల్లర కోసం కష్టపడుతుంటే అది మా నాన్న ఇచ్చిన ఆస్థితో హ్యపీగా ఉంది చూడు అంటుంది రుద్రాణి. అవును మమ్మీ అంటూ రాహల్‌ బాధపడతాడు. తర్వాత ఇద్దరూ కలిసి ప్లాన్‌ ప్రకారం స్వప్నకు ఫోన్‌ లో లింక్‌ పంపించి అకౌంట్‌ లో డబ్బులు కొట్టేస్తారు. డబ్బులు పోయాయని స్వప్న బాధపడుతుంటే చూసి నవ్వుకుంటారు. సూరజ్‌, రాజ్‌ ఆఫీసుకు వస్తాడు. ఆక్షన్‌ విషయంలో కంగ్రాట్స్‌ చెప్తాడు.

రాజ్‌: చెప్పరా..? ఏంటి ఇలా వచ్చావు.

సూరజ్: గుడ్‌ న్యూస్‌ తో వచ్చానురా..? అరేయ్‌ గుడ్‌ న్యూస్‌ అంటే హ్యాపీగా చూస్తావనుకుంటే ఆశ్యర్యగా చూస్తావేంట్రా..?

రాజ్‌: ఆ పదం విని చాలా రోజులైందిరా..? అందుకే అలా అనిపించింది.

సూరజ్: మీ డిజైన్స్‌ అమెరికా క్లయింట్స్‌కు బాగా నచ్చాయి. వాళ్లతో మీటింగ్‌ అరైంజ్‌ చేశాను. మీరు అమెరికా వెళ్లి వాళ్లకు మీ డెమో ఇస్తే కాంట్రాక్ట్‌ ఓకే చేసుకోవచ్చు.

కావ్య: కంగ్రాట్స్‌ అండి ఎప్పుడు వెళ్తున్నారో చెప్పండి లగేజీ మొత్తం సర్దేస్తాను.

సూరజ్: వాడొక్కడే కాదండి.. మీరు కూడా వెళ్లాలి. వీసా త్వరగా వచ్చేలా చేసుకోండి

అంటూ చెప్పి వెళ్లిపోతాడు సూరజ్‌. కావ్య ఆశ్యర్యంతో గంతులేస్తుంది. తీన్మార్‌ డాన్స్‌ చేస్తుంది. మరోవైపు రాహుల్‌ రుద్రాణి కలిసి తన డబ్బులు కొట్టేశారని తెలుసుకున్న స్వప్న ఎలాగైనా వాళ్లను బోల్తా కొట్టించాలని స్వప్న కూడా ఒక లింక్‌ రాహుల్‌కు పంపిస్తుంది. రాహుల్‌ అది క్లిక్‌ చేయగానే.. అకౌంట్‌ లో డబ్బులు మొత్తం స్వప్న అకౌంట్‌ లోకి వెళ్తాయి. దీంతో రాహుల్‌, రుద్రాణి లబోదిబోమంటారు. స్వప్న వచ్చి వెటకారంగా డబ్బులు పోయాయా అని అడుగుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!