Brahmamudi Serial Today Episode: రాజ్‌, కావ్యలు తమ బిడ్డ గురించి ధర్మేంద్ర గురించి రూంలో కూర్చుని ఆలోచిస్తుంటారు. బిడ్డను ఎలా తెచ్చుకోవాలో..? ఇప్పుడున్న పాపకు ఆపరేషన్‌ సక్సెస్‌ కావాలని అనుకుంటుంటుంటారు.

రాజ్‌: వాడి బలహీనత వాడి భార్య. మనం ఎప్పుడు నిజం చెప్పేస్తామోనని వాడి నుంచి బిడ్డను ఎక్కడ తెచ్చుకుంటామోనని? భయపడి చస్తున్నాడు.. ఏదో ఒకరోజు వాడు తప్పులన్నీ ఒప్పుకుని మారిపోతాడని నాకు నమ్మకం ఉంది

కావ్య: కానీ భార్య మీద వాడికున్న ప్రేమ .. బలహీనతలో నుంచి బలంగా మారితే వాడు ఇంకా రాక్షసుడిలా మారతాడేమో? భార్యను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాడేమో

రాజ్‌: వాడిని మార్చాలని.. వాడిని బుద్ది బలంతో కొట్టాలని, వాడంతటే వాడే కళ్లు తెరవాలని చెప్పింది నువ్వే కదా..? మళ్లీ ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి..? కళావతి

కావ్య: సంస్కారం ఉన్న వాళ్లకి ఒకటే దారి.. కానీ అలాంటి నీచులకి, తెగించిన వాళ్లకి వంద దారులు ఉంటాయి

రాజ్‌: అక్కడి వరకు వస్తే వాడికంటే మనం ఒక మెట్టుపైనే ఉంటాము.. తాళి కట్టించుకున్న భార్య కోసం వాడే అంత చేస్తే.. పేగు తెంచుకున్న మమకారం కోసం మనమెంత తెగించాలి.. వాడిది స్వార్ధం.. మనది బంధం. తల్లి అనురాగం ముందు వాడి అధికారం ఓడిపోక తప్పదు. ఆ మినిస్టర్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది

అంటూ రాజ్ చెప్పగానే.. ఏమో చూద్దాం.. మన ప్రయత్నం మనం చేద్దాం. అంతిమంగా మన బిడ్డను దక్కించుకోవాలి అంటుంది కావ్య. తర్వాత తులసి, కావ్య ఇద్దరు కలిసిపోయినట్టు ధర్మేంద్ర కలగంటాడు. నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తాడు.

ధర్మేంద్ర: ఈ టెన్షన్‌ భరించలేను.. తులసి ముందు తప్పు ఒప్పుకుని నిజం చెప్పాలి. నా భార్యను క్షమించమని అడగాలి. తులసిని కాపాడుకోవాలి.

అనుకుంటూ కింద పాపతో ఉన్న తులసి దగ్గరకు వెళ్తాడు ధర్మేంద్ర.

ధర్మేంద్ర: కావ్య, రాజ్‌ల ప్రాబ్లమ్ గురించి ఆలోచిస్తున్నాను

తులసి: కావ్య తన బిడ్డకు దూరమై.. ఎంత వేధన పడుతుందో తెలుసా? మీరే వాళ్లకి సాయం చేస్తానని చెప్పారు కదా

ధర్మేంద్ర: ఎవరో పురిట్లోనే వాళ్ల బిడ్డను మార్చేశారు అంటే వాళ్లకు ఆ బిడ్డతో ఎంత అవసరం ఉందో? వాళ్లు ఏ పరిస్థితుల్లో అలా చేశారో? వాళ్ల వైపు కూడా ఒకసారి ఆలోచించాలని కదా..?

తులసి: కన్నతల్లికి బిడ్డను దూరం చేసి ఆ తల్లి కన్నీళ్లకు కారణమైన వాళ్లకి మీరు సపోర్ట్ చేస్తున్నారా..? కారణం ఏదైనా సరే.. వాళ్లు మీకు కనక దొరికితే నేను వాళ్లను జైళ్లో వేయిస్తాను.. చివరికి మీరైనా సరే శిక్ష పడాల్సిందే

అంటూ తులసి చెప్పి వెళ్లిపోతుంది. వెంటనే ధర్మేంద్ర రాజ్‌కు ఫోన్‌ చేసి కలాలని చెప్తాడు. కట్‌ చేస్తే రాజ్‌, ధర్మేంద్ర ఒక దగ్గర కలుస్తారు.

ధర్మేంద్ర: నేను ఇంత చెబుతున్నా, ఇంత తాపత్రయపడుతున్నా.. నా పాపని తీసుకెళ్లడానికి సిద్ధపడుతున్నావా

రాజ్: నేను తీసుకెళ్తానన్నది మీ పాపని కాదు.. నా పాపని

ధర్మేంద్ర: పాపని ఇవ్వలేను.. నా భార్య బతకదు. నా భార్యకు నిజం చెప్పలేను, ఈ ప్రపంచంలో నాకు నా భార్య కన్నా ఏది ఎక్కువ కాదు. కావాలంటే నా పదవినైనా వదులుకుంటాను కానీ నా పాపని వదులుకోను, నా భార్యను చంపుకోను

రాజ్‌: నీ భార్య మాత్రం ఆరోగ్యంగా ఉన్న పాపతో ఆనందంగా ఉండాలి.. నా భార్య మాత్రం తన కడుపున పుట్టిన బిడ్డను దూరం చేసుకుని సంబంధం లేని బిడ్డను చూసుకుంటూ కన్నీళ్లతో బతకాలా? రేపే పాపకు ఆపరేషన్‌ చేయిస్తున్నాం.. నీకు ఇచ్చిన గడువు కూడా రేపటితో ముగుస్తుంది నువ్వు మా పాపను మాకు అప్పగిస్తే సరే లేదంటే మీ ఆవిడకు నిజం చెప్పేస్తాం

అంటూ వార్నింగ్‌ ఇచ్చి రాజ్ వెళ్లిపోతాడు. తర్వాత కావ్య, తులసి దగ్గరకు వెళ్లి పాపకు బారసాల చేయిస్తున్నామని తులసిని, మినిస్టర్‌ ను రమ్మని పిలుస్తుంది. తులసి సరే అంటుంది. అంతా గమనించిన ధర్మేంద్ర, రుద్రాణికి మొత్తం చెప్తాడు. దీంతో రుద్రాణి కోపంగా తిడుతుంది. అంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు అంటూ సీరియస్‌ అవుతుంది. ఇక ఈ విషయం నాకు వదిలేయ్‌ నేను చూసుకుంటాను అంటూ ధాన్యలక్ష్మీకి ఫోన్‌ చేస్తుంది రుద్రాణి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title=" ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self"> ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!