సన్నీ డియోల్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'బోర్డర్ 2' బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతోంది. రిపబ్లిక్ డే హాలిడేని బాగా క్యాష్ చేసుకుంది. దాంతో ఈ సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'పుష్ప 2' రికార్డును ఒక దానిని బ్రేక్ చేసింది. ఇంతకీ, ఆ రికార్డు ఏమిటి? 'బోర్డర్ 2' కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...

'బోర్డర్ 2' సినిమా 1997లో విడుదలైన కల్ట్ క్లాసిక్ 'బోర్డర్'కి ఇది సీక్వెల్. దీనికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 1971లో జరిగిన భారత్ - పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందించారు. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి నటించారు. బాక్సాఫీస్ వద్ద 'బోర్డర్ 2' సత్తా చాటుతోంది, కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన నాలుగో రోజున... అంటే మొదటి సోమవారం ఈ సినిమా ఎంత వసూలు చేసిందో ఇక్కడ తెలుసుకోండి.

'బోర్డర్ 2' నాలుగు రోజుల వసూళ్లు ఎంతంటే?
'బోర్డర్ 2'ను చూడటానికి థియేటర్లకు ప్రేక్షకుల భారీ ఎత్తున వచ్చారు. ఈ సినిమాకు నాలుగు రోజులుగా అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ వస్తున్నాయి. ఫలితంగా భారీ వసూళ్లు రాబడుతోంది. సినిమా వసూళ్ల గురించి చెప్పాలంటే... రూ. 30 కోట్లతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ లభించింది. రెండో రోజు అయినటువంటి శనివారం రూ. 36.5 కోట్లు, మూడో రోజు అయినటువంటి ఆదివారం రూ. 54.5 కోట్లు వసూలు చేసింది. వీకెండ్‌లో రూ. 121 కోట్లు వసూలు చేసింది. నాల్గవ రోజున గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా వసూళ్లలో మరోసారి భారీ పెరుగుదల కనిపించింది.

సక్నిల్క్ నివేదిక ప్రకారం... 'బోర్డర్ 2' విడుదలైన నాలుగవ రోజున, అంటే మొదటి సోమవారం రూ. 59 కోట్లు వసూలు చేసింది.

'బోర్డర్ 2' నాలుగు రోజుల మొత్తం వసూలు ఇప్పుడు రూ. 180 కోట్లకు చేరుకుంది.

Also Read: Padma Awards 2026: సౌత్‌ సినిమాలో విరిసిన పద్మాలు... తెలుగు హీరోలు ఇద్దరికి పద్మశ్రీ, దివంగత ధరేంద్రకు పద్మ విభూషణ్

మొదటి సోమవారం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు
'బోర్డర్ 2' మొదటి సోమవారం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. అలాగే, సినిమా విడుదలైన మొదటి సోమవారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 'పుష్ప 2' నుండి 'ఛావా', 'ధురంధర్', 'పఠాన్', 'జవాన్' వరకు అనేక పెద్ద సినిమాల కంటే ఎక్కువ వసూళ్ళు సాధించింది. సక్నిల్క్ ప్రకారం... మొదటి సోమవారం అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు ఇక్కడ ఉన్నాయి.

బోర్డర్ 2 - 59 కోట్లు

టైగర్ 3 - 58 కోట్లు

పుష్ప 2 - 46.4 కోట్లు

బాహుబలి 2 - 40.25 కోట్లు

యానిమల్ - 40.06 కోట్లు

గదర్ 2 - 38.7 కోట్లు

స్త్రీ 2 - 38.1 కోట్లు

టైగర్ జిందా హై - 36.54 కోట్లు

హౌస్‌ఫుల్ 4 - 34.56 కోట్లు

క్రిష్ 3 - 33.41 కోట్లు

జవాన్ - 30.5 కోట్లు

200 కోట్ల క్లబ్‌కు చేరుకోవడానికి అడుగు దూరంలో 'బోర్డర్ 2'
'బోర్డర్ 2' బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లో 180 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పుడు 200 కోట్ల క్లబ్‌కు చేరుకోవడానికి అడుగు దూరంలో ఉంది. మరో 20 కోట్లు వసూలు చేస్తే చాలు ఈ చిత్రం ఈ మైలురాయిని దాటేస్తుంది. సినిమాకు వస్తున్న సానుకూల స్పందనను చూస్తుంటే, మంగళవారం నాటికి ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో ప్రవేశిస్తుంది.

Also Read: Yuzvendra Chahal: అటు బ్రేకప్... ఇటు మరో మహిళతో డిన్నర్... యుజ్వేంద్ర ఫోటోలు వైరల్