BJP advice to Pawan: గ్రామపంచాయతీ క్లస్టర్ వ్యవస్ధలో మార్పులకు పవన్ నిర్ణయం - కీలక సూచనలు చేసిన బీజేపీ
10 months ago 7
ARTICLE AD
Pawan decided to change the panchayat cluster system: పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూసేందుకు దీని కోసం సిబ్బంది లేమి సమస్యను అధిగమించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు ఇందులో భాగంగా  పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు.
పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని మాత్రమే గతంలో   క్లస్టర్ గ్రేడ్ల విభజన చేపట్టారు. ఇప్పుడు  జనాభాను కూడా ప్రాతిపదికగా తీసుకొని పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించాలని సూచించారు. సిబ్బంది నియామకం విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా, గ్రామ పంచాయతీల్లో సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా మార్పులు ఉండాలన్నారు.   ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభాగా ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో పాత క్లస్టర్ వ్యవస్థ వల్ల సిబ్బంది నియామకం విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి.
గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకొని కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంలో సిబ్బందిని నియమించునే అంశంపై చర్చించారు.  వీటిపై అధ్యయనం చేసి పంచాయతీల్లో పరిపాలన సులభతరం చేసేందుకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కమిటీ వేయాలని  పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
ఏపీలోని గ్రామ పంచాయతీలకు క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు తీసుకొస్తూ కమిటీ ఏర్పాటు చేసి, అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆలోచన అభినందనీయం. కేంద్రం @narendramodi గారి సహకారంతో ఇప్పటికే పెద్ద ఎత్తున పంచాయతీలకు నిధులు కేటాయించింది. నేడు మీరు… https://t.co/sVYwgpPS5P
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) January 23, 2025
బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రస్తావించిన అంశాలను కూడా పంచాయతీరాజ్ శాఖ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
Also Read: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Read Entire Article