Rajasekhar As Bullet Sunil In Sharwanand Biker Movie : సంక్రాంతి బ్లాక్ బస్టర్ సక్సెస్ జోష్‌లో ఉన్న ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా రాబోతోన్న రీసెంట్ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా 'బైకర్'. ఈ మూవీలో శర్వా తండ్రిగా సీనియర్ హీరో రాజశేఖర్ కనిపించబోతున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా రోల్ ఇంట్రడ్యూస్ చేస్తూ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

బుల్లెట్ సునీల్‌గా...

'ఈ స్పోర్ట్ క్రికెట్ కాదు సునీల్... ఎవడూ పట్టించుకోడు. డోంట్ వేస్ట్ యువర్ టైం.' అనే వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ ప్రారంభం కాగా... అసలేవరీ సునీల్... అంటూ ఓ హైప్‌తో రాజశేఖర్ ఎలివేషన్ ఇచ్చారు. 'ఫార్మర్ మోటో క్రాస్ రేసర్. అప్పట్లో బుల్లెట్ సునీల్ అనేవారు. 18 ఇండియన్ ఛాంపియన్ షిప్స్. 57 సౌత్ జోన్ టైటిల్స్. 100కి పైగా రేస్ విజయాలు.' అంటూ బిగ్ ఎలివేషన్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

'ఇండియన్ రేసర్స్‌పై ఉన్న ఒపీనియన్ మారుద్దాం.' అంటూ రేసింగ్ సర్క్యూట్‌లో దేశం నిజమైన సామర్థ్యాన్ని నిరూపించడానికి నిశ్చయించుకున్న లక్ష్యంతో బుల్లెట్ సునీల్ ఉన్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత యాక్షన్, పవర్ ఫుల్‌గా రాజశేఖర్ లుక్ అదిరిపోయింది.

Also Read : ఆనంద్ దేవరకొండ 'తక్షకుడు' టీజర్ - ప్రేమ, పగ, ప్రతీకారం ఎవరిపై?... డైరెక్ట్‌గా ఓటీటీలోకే స్ట్రీమింగ్