Bigg Boss Bharani Sreeja Re Entry Task Promo : భరణిని నిన్న కట్టు, పడగొట్టు టాస్క్‌లో గాయపడ్డాడు. రిబ్స్ దగ్గర గాయం కావడంతో అతను ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. దీంతో భరణి తిరిగి రాడు.. శ్రీజనే బిగ్‌బాస్‌లో మళ్లీ కంటెస్టెంట్ అవుతుంది అనుకున్నారు. కానీ డాక్టర్లు భరణిని చెకప్ చేసి.. మళ్లీ లోపలికి పంపించారు. అయితే బిగ్‌బాస్‌లో అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ శ్రీజదే అని బిగ్‌బాస్ ప్రేక్షకులు పెద్ద ఎత్తున చెప్తున్నారు. అయితే ఇప్పుడు కూడా శ్రీజకు బిగ్‌బాస్ అన్‌ఫెయిర్ చేస్తున్నాడా? ప్రోమోలో ఏముంది? హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

బిగ్‌బాస్ ప్రోమో హైలెట్స్..

బిగ్‌బాస్ డే 53 ప్రోమో వచ్చింది. అయితే దీనిలో భాగంగా బిగ్‌బాస్ శ్రీజ, భరణికి మరో టాస్క్ గురించి వివరించాడు. అయితే భరణి గాయంతో ఉన్నాడు కాబట్టి.. అతనికి బదులుగా తనకు సపోర్ట్ చేసేవారిలో ఎవరినైనా ఎంచుకోవాలని సూచించాడు. భరణి. నిఖిల్, దివ్యలో ఎవరు చేస్తారంటూ అడగ్గా.. దివ్య నేను చేస్తానంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పింది. దీంతో దివ్య, శ్రీజ టాస్క్ ఆడేందుకు సిద్ధమయ్యారు. మాధురి సంచాలకురాలిగా చేస్తుంది.

శ్రీజకు మరో మారు అన్యాయం చేసిన బిగ్‌బాస్..

స్టార్ట్ పాయింట్‌నుంచి ప్రారంభించి.. బ్లాక్స్‌ను కిందపడకుండా కర్ర మీద బ్యాలెన్స్ చేస్తూ.. 5 చోట్ల పెట్టాలని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. అయితే ఈ టాస్క్‌లో ఎత్తు అనేది చాలా ముఖ్యం. శ్రీజతో పోలిస్తే దివ్య కాస్త పొడుగే. పైగా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది. శ్రీజకు అలా కాదు.. కాస్త సన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కర్రను బ్యాలెన్స్ చేయలేకపోవచ్చు. కాబట్టి శ్రీజకు తగ్గట్లుగా ఈ రీఎంట్రీ ప్లాన్ చేసి ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రోమోలో చూపించినంత వరకు శ్రీజ, దివ్య కూడా ఇద్దరూ తమకు చేతనైనంతవరకు బాగానే ట్రై చేస్తున్నారు. మరి వీరిలో ఎవరు గెలిచారో ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

రీతూ హీరోయిన్.. పవన్ హీరో

బిగ్‌బాస్‌లో డే 53కి సంబందించి రెండో ప్రోమో కూడా వచ్చేసింది. అయితే ఇది పూర్తిగా కామెడీ మూడ్‌లో తీసుకెళ్లాడు. వర్షం కారణంగా టాస్క్‌లకు బ్రేక్ పడడంతో .. ఇమ్మూ ఇంట్లోవారిని ఎంటర్టైన్ చేయడం ప్రారంభించాడు. పవన్ ఓ సైడ్ గొడుగు పట్టుకుని ఉండగా.. మరోవైపు రీతూని గొడుగు పట్టుకుని ఉండమంటాడు. వారిద్దరూ హీరో హీరోయిన్స్ అని.. ఇమ్మూ అడిగిన క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ ఇచ్చుకుంటూ దగ్గరగా రావాలని చెప్తాడు. అయితే ఈ సమయంలో కాస్త ఫన్ జెనరేట్ చేశాడు ఇమ్మూ. ఈ సెకండ్ ప్రోమో పూర్తిగా ఎంటర్టైన్మెంట్ మూడ్‌లో సాగింది.