Bigg Boss Telugu Today Promo : బిగ్​బాస్​ సన్​ డే ఫన్​ డే.. రష్మిక ముందు అదుర్స్ స్కిట్ వేసిన కంటెస్టెంట్లు, తనూజకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన నాగ్

1 month ago 2
ARTICLE AD

Bigg Boss 9 Sunday Funday Task Promo : బిగ్​బాస్ తెలుగు సన్​డే ఫన్​ డే ప్రోమో వచ్చేసింది. సీజన్ 9 తెలుగు డే 56 స్పెషల్ సెలబ్రెటీలు, టాస్క్​లు జరిగాయి. దానికి సంబంధించిన రెండు ప్రోమోలు స్టార్ మా విడుదల చేసింది. గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్​లో భాగంగా రష్మిక కూడా బిగ్​బాస్​లోకి వచ్చింది. ఆమెను ఇంప్రెస్ చేయాలంటూ కొన్ని టాస్క్​లు పెట్టాడు నాగ్ మామ. అలాగే తనూజకి కూడా చాలా సింపుల్​గా క్లాస్ పీకాడు. ఇంతకీ ప్రోమోల్లో ఉన్న హైలెట్స్ ఏంటో చూసేద్దాం.

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో.. రష్మిక స్పెషల్

బిగ్​బాస్ సన్​ డే ఫన్​డేలో భాగంగా నాగార్జున చాలా స్టైలిష్​గా కనిపించారు. ప్రోమో స్టార్టింగ్​లో డ్యాన్స్ వేయగా.. తర్వాత ప్రేక్షకులకు, కంటెస్టెంట్లకు వెల్కమ్ చెప్పారు. నాగ్​ చూసిన సంజన.. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. అయితే ఇన్ని రోజులు కాదా అంటే.. అయ్యో అలా కాదుసార్.. శనివారం వెళ్లి సండే ఈజ్ బ్యాక్ అంటూ రిప్లై ఇస్తుంది. అయితే బిగ్​బాస్​కి గర్ల్​ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్​లో భాగంగా రష్మిక, దీక్షిత్ శెట్టి వచ్చారు. వారితో మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడి.. కంటెస్టెంట్లతో టాస్క్​లు చేయించారు నాగ్.

రష్మికను ఇంప్రెస్ చేయాలంటూ.. నాగార్జున కంటెస్టెంట్లకు మూవీలో సీన్స్ రీక్రియేట్ చేయాలంటూ చెప్పారు. దానిలో భాగంగా అందరూ మంచిగానే యాక్ట్ చేశారు. దాదాపు హిట్ సినిమాల్లోని కామెడీ ట్రాక్స్ ప్లే చేసి.. రష్మికను ఆకట్టుకున్నారు.

బిగ్​బాస్ సెకండ్ ప్రోమో.. తనూజకు తిట్లు..

తనూజకు ఆడియన్స్​లో ఎంత క్రేజ్ ఉందో.. ఆమెను బిగ్​బాస్ టీమ్ ఏమనట్లేదు అని అంతే కోపంగా ఉన్నారు ప్రేక్షకులు. ఎందుకంటే ఈ భామ చేసే తప్పులను బిగ్​బాస్, నాగ్ పెద్దగా వేలెత్తి చూపించట్లేదు. పైగా ఆమెకు సపోర్టివ్​గా వీడియోలు ప్లే చేస్తున్నారు. అయితే శనివారం జరిగిన ఎపిసోడ్​లో కూడా నాగార్జున ముందువారంలో ఇమ్మూకి, తనూజకి జరిగిన వీడియోను ఇప్పుడు ప్లే చేసి మరీ ఇమ్మూది తప్పుగా చెప్పారు. అయితే చివర్లో నీతో మాట్లాడాలి. రేపు మాట్లాడదాము అంటూ ముగించారు. దానికి సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అయితే దీనిలో నాగార్జున సీరియస్ అయ్యారు కానీ.. అందరిపై ఫైర్ అయినట్లు కాకుండా చాలా సింపుల్​గా చెప్పేశారు.

వారంలో 7 రోజులు ఉంటాయి. దానిలో నువ్వు ఉన్న ప్రతీసారి. అంటే ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, నైట్ ఇలా ప్రతీసారి నువ్వు గొడవపడ్డావు. దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు కానీ.. నీకు ఓ పని అప్పగించినప్పుడు దానిని బాధ్యతగా చేయాల్సి ఉంటుందని సింపుల్​గా వార్నింగ్ ఇచ్చాడు. అయితే గతవారం ఆమె కిచెన్ డిపార్ట్మెంట్ చేయనని చెప్పినా తనకే ఇచ్చారని చెప్పాగా.. ఇమ్మూ చెప్పలేదని చెప్తాడు. దివ్వెల మాధురి కూడా చెప్పలేదు కానీ సైలెంట్​గా ఉందంటూ చెప్పింది. అయితే ఈ ప్రోమో కింద ప్రోమోలోనే ఇంత సప్పగా ఉందంటే.. ఎపిసోడ్​లో నాగార్జున పెద్దగా తిట్టి ఉండరులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా అందరికి చెప్పిన టోన్​లో కూడా చెప్పలేదంటూ ఫీల్ అవుతున్నారు.

Read Entire Article