Bigg Boss Captaincy War Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు 39వ రోజు (Bigg Boss Telugu 9 Day 39 Promo) ప్రోమోను రిలీజ్ చేశాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా హోజ్‌ను రెండుగా విభజించాడు. అలాగే వారి మధ్య టాస్క్ పెట్టి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశాన్ని ఇచ్చాడు. దివ్వెల మాధురి ఈ కెప్టెన్సీ రేసు నుంచి భరణిని తప్పించింది. అలేఖ్య చిట్టిపికిల్స్ ఫేమ్ రమ్య కూడా టాస్క్‌లో ఉన్నప్పుడు భరణి ఒక్కసారిగా వెనక్కి లాగి తన బలాన్ని చూపించింది. ప్రోమోలో తనూజ, దువ్వాడ మాధురికి మధ్య గొడవజరిగినట్లు చూపించారు. మరి ప్రోమో హైలెట్స్ ఏంటో చూసేద్దాం.

బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్..

బిగ్‌బాస్ సీజన్ 39వ రోజుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మీ కెప్టెన్సీ కంటెండర్ కాపాడుకోవడానికి ఫైర్ స్ట్రామ్, వారు ఎంచుకున్న సభ్యులు రెండు టీమ్‌లుగా ఏర్పడి ఓ టాస్క్‌లో తలపడాల్సి ఉందని చెప్పాడు బిగ్‌బాస్. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన ఆరుగురు.. ఇప్పటికే ఇంట్లో ఉన్నవారిలో మరో ఆరుగురిని ఎంచుకునే అవకాశం ఉంది. కాబట్టి కెప్టెన్సీ టాస్క్‌కి వైల్డ్ కార్డ్ సెలక్ట్ చేసిన వారు తప్పా మిగిలిన వాళ్లు ఆడలేరు. వీరు ఓ గేమ్ ఆడితే.. గెలిచిన వారు కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ అవుతారు. దీనిలో భాగంగా బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ కెప్టెన్సీ ఏ.

ప్రతీ రౌండ్లో బజర్ మోగగానే.. సెంటర్లైన్పై ఉంచిన బాల్‌ను ప్రత్యర్థి టీమ్ పోస్ట్‌లో గోల్ చేయాలి. అయితే ఇలా గోల్ చేసిన ప్రతీసారి.. గెలిచిన వారు ఓడిపోయిన వారి టీమ్ నుంచి ఒక్కొక్కరిని బయటికి పంపవచ్చు అని తెలిపాడు. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు తమకు ఓడించడానికి వీలుగా ఉండేవారినే టాస్క్‌లో సెలక్ట్ చేసుకున్నారు. పవన్, కళ్యాణ్, ఇమ్మూ, రీతూలను గేమ్‌లో లేనట్లు తెలుస్తుంది. తనూజ, భరణి, ఇమ్మూ, సంజన ఆడినట్లు ప్రోమోలో కనిపించింది. అయితే మరి ఇది ఎంతవరకు నిజమో.. ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.

భరణిని తీసేసిన మాధురి

ప్రోమోలో ఫైర్ స్ట్రామ్ టీమ్ గెలిచి.. భరణిని ఈ కెప్టెన్సీ రేసు నుంచి తీసేసినట్లు దివ్వెల మాధురి చెప్పింది. అలాగే తనూజ తనని పుష్ చేశారంటూ ఆరోపించింది. కానీ మిగిలిన వాళ్లు పుష్ చేయలేదంటూ డిఫెండ్ చేశారు. దివ్వెల మాధురి కూడా ఏదో చెప్తుంటే తనూజ నేను సంచాలక్‌తో మాట్లాడుతున్నాను మీతో కాదు అంటూ సీరియస్ అవ్వడంతో ప్రోమో ముగిసింది. అయితే లైవ్ ప్రకారం తనూజ, ఇమ్మూ చివరివరకు ఉంటారు. కానీ ఫైనల్‌గా ఇమ్మూ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది.