Bigg Boss Alekhya Chitti Pickles Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు 38వ రోజుకు సంబంధించిన రెండో ప్రోమో విడుదల చేశాడు. ఉదయం దివ్వెల మాధురి మీదనే ప్రోమో రిలీజ్ చేయగా.. సెకండ్ ప్రోమోలో అలేఖ్య చిట్టి పికిల్స్ పాపని హైలెట్ చేశాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చి ఈ ఇద్దరు కాంట్రవర్సీ లేడీలు.. ఇంట్లో మాట్లాడుతున్న మాటలు, స్టేట్మెంట్లు అంతా ఇంతా కాదు. దివ్వెల మాధురి అయితే బిగ్‌బాస్ హోజ్నే తన హోజ్గా మార్చుకుని అందరిపై నోరేసుకుని పడిపోతుంది. అయితే ఈ సెకండ్ ప్రోమోలో ఆమె ఎక్కడా కనిపించలేదు. మరి అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ప్రోమోలో హైలెట్ అయిన విషయాలేంటో చూసేద్దాం.

బిగ్‌బాస్ సీజన్ 9 లేటెస్ట్ ప్రోమో హైలెట్స్..

ఇమ్మూ మరోసారి తనదైన ఎంటర్టైన్మెంట్ను కంటెస్టెంట్లకు అందిస్తున్నాడు. రీతూ, సుమన్ శెట్టి మాట్లాడుకుంటుండగా.. వారికి వాయిస్ ఓవర్ ఇస్తానంటూ కామెడీ చేశాడు. తనూజ, భరణి ఇమ్మూ కంటెంట్‌కి నవ్వుతారు. ఫ్లోరాని నవ్వుతూ పంపించినట్టే నిన్ను కూడా పంపించేస్తాను అనేసరికి భరణి గట్టిగా నవ్వేస్తాడు. అలాగే ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన గౌరవ్ గుప్తాకు ఇమ్మూ తెలుగు నేర్పేందుకు ప్రయత్నిస్తాడు. పాపం గౌరవ్ తెలుగు నేర్చుకునేందుకు చాలా కష్టపడతాడు. ఆ సమయంలో ఇమ్మూ కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరిని కించపరచకుండా.. తెలుగు పదాలు చెప్తూ.. నేర్పించాలనుకుంటాడు కానీ.. అది నవ్వు తెప్పించే విధంగా ఉంది.

అలేఖ్య పాపను హైలెట్ చేసిన బిగ్‌బాస్

ఇక ఈ ప్రోమోలో అలేఖ్య చిట్టిపికిల్స్ పాప హైలెట్ ఎందుకయ్యింది అంటే.. బజర్ మోగుతుంది. అందరూ సోఫాలో కూర్చుంటారు. స్టోర్ రూమ్ బెల్ మోగగా.. గౌరవ్ వెళ్లి తీసుకువద్దామనుకుంటే.. ఇమ్మూ నువ్వు వెళ్లి చదివేద్దామనుకుంటున్నావా అంటూ కామెడీ చేసేసరికి అందరూ నవ్వేస్తారు. ఇక అలేఖ్యకు బిగ్‌బాస్ ఎంట్రీకి ముద్దు నాగ్ ఇచ్చిన పవర్‌ను ఇస్తాడు. అలేఖ్య చిట్టిపికిల్స్ ఫేమ్ రమ్య.. తనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చని.. అయితే కంటెస్టెంట్లలో ఒకరిని తనకి తోడుగా తీసుకోవచ్చని చెప్తాడు. అయితే ప్రోమో ప్రకారం రమ్య సుమన్ శెట్టిని ఎంచుకున్నట్లు కనిపిస్తుంది.

లిస్ట్ ఏంటి ఇంతుంది..

ఏదో బిగ్‌బాస్ ఫేవరెట్ ఫుడ్ అడిగితే.. అలేఖ్య బ్రేక్‌ఫాస్ట్ నుంచి మొదలు పెట్టి బ్రేక్ ఇవ్వకుండా లిస్ట్ చెప్పేస్తుంది. పెసరట్టు ఉప్మా, ఎగ్స్, చికెన్ జాయింట్స్, పిజ్జా ఇలా ఫుడ్ ఐటమ్స్ చెప్తూ ఉంటుంది. వెనకనుంచి రీతూ.. పక్కన సంజన వింటూ షాకైపోతారు. దీంతో ప్రోమో ముగిసింది. మరి ఈమెకు ఫుడ్ వస్తుందో లేదో.. దానిని ఎవరితో షేర్ చేసుకుంటుందో.. ఎపిసోడ్ వరకు వేచిచూడాల్సిందే.